చిత్తూరు, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
ఉమ్మడి చిత్తూరు జిల్లా 35 వేల మంది మామిడి రైతుల అకౌంట్లో ₹480 కోట్లు జమ చేయకపోవడం దుర్మార్గమని మామిడి రైతుల సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల పల్ప్ ఫ్యాక్టరీలకు మామిడి సరఫరా చేసి మూడు నెలలు దాటినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, రైతులను ఆందోళనకు గురిచేయడం ఆందోళన కలిగిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ లో ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు.


