Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Kadapa

మామను హత్య చేసిన అల్లుడు

Punnami Newsroom Published: Updated:
మామను హత్య చేసిన అల్లుడు

మామను హత్య చేసిన అల్లుడు

పున్నమి ప్రతినిధి | కడప జిల్లా | లింగాల | అక్టోబర్ 3

కడప జిల్లా లింగాల మండలం మురారిచింతల గ్రామంలో శుక్రవారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. అల్లుడి చేతిలో మామ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

స్థానికుల వివరాల ప్రకారం.. మురారిచింతల గ్రామానికి చెందిన అంకే రాజబాబు తన కుమార్తెను వేంపల్లెకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అయితే కొంతకాలంగా అల్లుడు తన కుమార్తెను వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వారం రోజుల క్రితం ఆమెను పుట్టింటికి తీసుకొచ్చినట్లు సమాచారం.

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి అల్లుడు మామ ఇంటికి వచ్చి గొడవకు దిగినట్లు తెలిసింది. ఉదయం మాట్లాడుకుందామని కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆగ్రహించిన అల్లుడు కత్తితో మామ రాజబాబుపై దాడి చేసినట్లు సమాచారం.

తీవ్రంగా గాయపడిన రాజబాబును కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం పులివెందుల ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో రాజబాబు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం.

ఈ ఘటనతో మురారిచింతల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

మామను హత్య చేసిన అల్లుడు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *