Sunday, 22 March 2026
  • Home  
  • మానవాళి ప్రాణాలు కాపాడేశక్తి వైద్య వృతికి మాత్రమే వుంది…. కోలా ఆనంద్
- తిరుపతి

మానవాళి ప్రాణాలు కాపాడేశక్తి వైద్య వృతికి మాత్రమే వుంది…. కోలా ఆనంద్

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ శుక్రవారం నాడు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో గల శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్, రీసెర్చ్ సంస్థ నందు జరిగిన వైట్ కోట్ సెరిమనీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ.. మానవాళి ప్రాణాలు కాపాడేశక్తి వైద్య వృతికి మాత్రమే వుందన్నారు. మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులు వైట్ కోట్ ధరించడం మీ అందరి జీవితాల్లో ఒక అపూర్వమైన, అద్భుతమైన మధుర క్షణాలని మొదటి సంవత్సరం వైద్య విద్యార్ధులకు కోలా ఆనంద్ పేరుపేరునా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. వైద్య విద్యార్థులకు ఇది కేవలం వైట్ కోటు ధరించే రోజు కాదని వారి వైద్య ప్రయాణానికి తొలి అధ్యాయం ప్రారంభమయ్యే పవిత్ర రోజని మీరు ధరించబోయే ఈ వైట్ కోట్, అది కేవలం వస్త్రం కాదు అది స్వచ్చతకు నైతికతకు, నిస్వార్థ సేవకు, మానవత్వానికి ప్రతీక అదే ప్రాణాలను కాపాడే వైద్య విద్య. ఈ ప్రపంచంలో చాలా వృత్తులు ఉంటాయి. ఇతరులు భవనాలు, సామ్రాజ్యాలు నిర్మిస్తారు కానీ వైద్యులు మాత్రమే మానవజాతి యొక్క ఆశలు, ప్రాణాలు, భవిష్యత్తులు నిర్మిస్తారని కోలా ఆనంద్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షులు పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి, కుర్రకాల్వ వేణు, టౌన్ బ్యాంక్ వైస్ ఛైర్మన్ గోవర్ధన్, మేకల గురవయ్య, ఐనూరు భాస్కర్, సాయి, చైతన్య, ముని శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.