అనకాపల్లి అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) :
రాంబిల్లి మండలం మురకాడ గ్రామానికి చెందిన ఈరిగిల సూరిబాబు షుగర్ కారణంగా ఒక కాలు కోల్పోయి పనిచేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఆయనకు ప్రభుత్వం నుంచి పెన్షన్ అందకపోవడంతో, శాసనసభ్యులు సుందరపు విజయకుమార్ తన సొంత నిధులతో నెలవారీ పెన్షన్ అందిస్తున్నారు. ఈ హృదయపూర్వక సహాయం ద్వారా సూరిబాబుకు జీవితంలో కొంత ఊరట లభించింది. ఈ కార్యక్రమంలో సూర్య ప్రకాష్, నూకన్న దొర, సన్యాసినాయుడు, ప్రగడ శివ, తాతాజీ, శ్రీను, శేషగిరి, నరసింహమూర్తి, బద్ది సత్యరావు, వెంకటరమణ, కామేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధిగా విజయకుమార్ అందిస్తున్న ఈ మానవీయ సహాయం స్థానికుల ప్రశంసలందుకుంది.


