మాదిగ అమరవీరుల ఆశయ సాధనకు కృషి చేస్తాం ఎస్సీ వర్గీకరణ జరగడానికి కారణం మాదిగ అమరవీరుల త్యాగ ఫలితమే
నేడు దుత్తలూరు టౌన్ లోని ఏసి కాలనీ నందు ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగపట్ల సింహాద్రి మాదిగ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవం కొవ్వత్తులతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ
ఎంఎస్పీ అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ పోల్గొని వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమరుల త్యాగ ఫలితమేనని పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో అతి తక్కువ మందితో ప్రారంభమైన ఉద్యమం నేడు ప్రధానమంత్రినే కదిలించే విధంగా తయారైందని తెలిపారు అనేక ఒడిదుడికలతో కష్టనష్టాలతో ఉద్యమం ముందుకు సాగి నేడు ఎస్సీ వర్గీకరణ సాధించేంతవరకు కొనసాగిందన్నారు అమరవీరుల త్యాగఫలితంగానే వర్గీకరణ జరిగిందని తెలిపారు ఈ వర్గీకరణతో నేడు డీఎస్సీలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇతర ఉద్యోగాలు పొందగలిగామని అదే విధంగా భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో రాజ్యాధికారం చేపట్టే విధంగా మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపుమేరకు ముందుకు సాగుతామని వర్గీకరణ కోసం అసువులు బాసిన మాదిగ అమరవీరులు ఆశయాలతో భవిష్యత్ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు రాష్ట్రంలోని మాదిగ ప్రజల హక్కుల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో అసువులు బాసిన మాదిగ అమరవీరులు ఎంతో పుణ్యాత్ములు అన్నారు వారి ఆశయాలను. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ మండల నాయకులు సొంగ రవి మాదిగ,యనమల గిరి మాదిగ,వడ్లపల్లి కల్యాణ్ మాదిగ,యనమల ఉపేంద్ర, ఎ పాపయ్య,ప్రసన్న, ఏడుకొండలు మాదిగ విధ్యార్ధులు మాదిగ పెద్దలు యువకులు తదితరులు అధికసంఖ్యలో పొల్గన్నారు.


