మాదాల కుటుంబానికి సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
దుత్తలూరు సెప్టెంబర్ 17 : (పున్నమి న్యూస్):///
దుత్తలూరు మండలము నర్రవాడ పంచాయతీ ఉలవవారిపాలెం గ్రామంలో మాదాల మంగమ్మ పెదకర్మ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు.మాదాల కుటుంబ సభ్యులతో కలిసి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సంతాపం వ్యక్తం చేసి, మంగమ్మ చిత్రపటమునకు పుష్పాంజలి ఘటించి, వారి మరణం కుటుంబానికి తీరని లోటు అని పేర్కొన్నారు.మంగమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు,స్థానిక ప్రజలు, బంధుమిత్రులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.


