*మాదకద్రవ్యాలతో భవిష్యత్ నాశనం : పొదలకూరు సీ.ఐ శివరామకృష్ణారెడ్డి*
_*మాద్యక ద్రవ్యాలు, ఈవ్ టీచింగ్, పై విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో అవగాహన*
పొదలకూరు పున్నమి ప్రతినిధి :మాదకద్రవ్యాల అలవాటుతో భవిష్యత్ నాశనమ వుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి, ఎస్.ఐ హనీఫ్ అన్నారు.బుధవారం పట్టణం లోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో మాదకద్రవ్యాల నివారణ, ఈవ్ టీచింగ్- ర్యాగింగ్ పై పొదలకూరు ఎస్. ఐ హనీఫ్ తో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీ.ఐ శివరామకృష్ణ రెడ్డి ,ఎస్.ఐ హనీఫ్ మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్ నాశనమవుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో గొప్పవాళ్ళను చేయాలనే ఆశతో ఉంటే కొంత మంది యువత డ్రగ్స్‌కు అలవాటుపడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. డ్రగ్స్ సరఫరా చేసేవారి ఆట కట్టించడానికి పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉన్నామని 112 లేదా సమీపంలో పోలీస్ వారికి తెలియజేయాలని సూచించారు.ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ అనేవి నేరమని, ఎవరైనా తోటి విద్యార్థులపై ర్యాగింగ్ కు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలుంటాయని భవిష్యత్తు కోల్పోతారని తెలిపారు.సమస్యలు ఎదురైనప్పుడు యువత ధైర్యంతో ఎదుర్కొవాలే తప్ప ఆత్మహత్య అనేది సమస్యలకు పరిష్కారం కాదన్నారు. కళాశాలలు , ఆలయాలు, ప్రధాన కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిది అన్నారు.గ్రామాల్లో ప్రవేశ ద్వారం ,ఆలయాల వద్ద గ్రామాని కి వెలుపలకు వెళ్లే మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను నియంత్రించగల్గుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జూనియర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్ ఏ.సుబ్బారావు, జి .ఎన్ .రెడ్డి, అకడమిక్ డీన్ చల్లా వెంకటకృష్ణ, జూనియర్ కాలేజ్ , వైస్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, అధ్యాపక బృందం, పోలీసు సిబ్బంది సౌమ్య,మోహన్,రవితేజ, రసూల్ పాల్గొన్నారు.ఇది


