ముఖ్యఅతిథిగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి
పున్నమి ప్రతినిధి, 10 మార్చి 2026 తిరుపతి
శ్రీ మాతృశ్రీ విద్యానికేతన్ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, అంకితభావం అలవరుచుకోవాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలరని అన్నారు.
సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువులకే అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి అభినందనీయమన్నారు.* కేవలం చదువుకే పరిమితం కాకుండా, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని, ఇది వారి మానసిక వికాసానికి తోడ్పడుతుందని సూచించారు.* విద్యా రంగానికి
ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని వివరిస్తూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.



