అరకులోయ(పున్నమి ప్రతినిధి ), అక్టోబర్:30
మొంథా తుఫాను ప్రభావంతో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల అరకులోయ మండలం మాడగడలో కొండవాలు నుంచి వస్తున్న ఊటనీరు ఇళ్లల్లోకి చేరుతుంది. సుమారుగా 40 ఇళ్లకు పైబడి కొండ ఊట నీటితో ఇల్లు ముద్దవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న టిడిపి అరకు ఇన్చార్జి, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర గురువారం ఆ గ్రామంలో పర్యటించారు. ఊటనీరు రావడంతో కొన్ని నివాస గృహాల గోడలు కూలిపోవడాన్ని పరిశీలించారు. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడం పై అధికారులను ఆయన ప్రశ్నించారు. ఎందుకు ఇప్పటివరకు పరిష్కారం చూపలేదని నిలదీశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. వర్షాలు పడే ప్రతి సారి తమ గ్రామంలో ఉన్న ఇళ్ల లోకి ఊటనీరు వచ్చేస్తుందని తమకు శాశ్వత పరిష్కారం చూపాలని సందర్భంగా వారంతా కోరారు. తమను వేరే ప్రాంతానికి తరలించి ఈ సమస్య నుంచి విముక్తి కల్పించాలని విన్నవించారు. గ్రామంలో కూడా ఎక్కడా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని వచ్చిన నీరు బయటకు పోయేందుకు మార్గం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై దొన్నుదొర స్పందిస్తూ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభుత్వంతో చర్చిస్తామని భరోసా ఇచ్చారు. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా చూసేలా పరిష్కారం వెతుకుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లోకోయి మహదేవ్, ప్రధాన కార్యదర్శి పాంగి రాజు, నాయకులు రామచందర్ కిరణ్, సుబ్బారావు, భీమన్న, జగన్, బాలరాజు, ఆనంద్, సోన్ను,శంకర్ రావు, అరకు అసెంబ్లీ మీడియా కో ఆర్డినేటర్ బాలు దొర, శేఖర్, కొర్ర బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

మాడగడలో దొన్నుదొర పర్యటన కొండ నుంచి ఇళ్లల్లోకి ఊరుతున్న నీరు శాశ్వత పరిష్కారం చూపాలని కోరిన గ్రామస్తులు వేరే ప్రాంతానికి తరలించి విముక్తి కల్పించాలని వినతి
అరకులోయ(పున్నమి ప్రతినిధి ), అక్టోబర్:30 మొంథా తుఫాను ప్రభావంతో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల అరకులోయ మండలం మాడగడలో కొండవాలు నుంచి వస్తున్న ఊటనీరు ఇళ్లల్లోకి చేరుతుంది. సుమారుగా 40 ఇళ్లకు పైబడి కొండ ఊట నీటితో ఇల్లు ముద్దవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న టిడిపి అరకు ఇన్చార్జి, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర గురువారం ఆ గ్రామంలో పర్యటించారు. ఊటనీరు రావడంతో కొన్ని నివాస గృహాల గోడలు కూలిపోవడాన్ని పరిశీలించారు. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడం పై అధికారులను ఆయన ప్రశ్నించారు. ఎందుకు ఇప్పటివరకు పరిష్కారం చూపలేదని నిలదీశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. వర్షాలు పడే ప్రతి సారి తమ గ్రామంలో ఉన్న ఇళ్ల లోకి ఊటనీరు వచ్చేస్తుందని తమకు శాశ్వత పరిష్కారం చూపాలని సందర్భంగా వారంతా కోరారు. తమను వేరే ప్రాంతానికి తరలించి ఈ సమస్య నుంచి విముక్తి కల్పించాలని విన్నవించారు. గ్రామంలో కూడా ఎక్కడా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని వచ్చిన నీరు బయటకు పోయేందుకు మార్గం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై దొన్నుదొర స్పందిస్తూ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభుత్వంతో చర్చిస్తామని భరోసా ఇచ్చారు. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా చూసేలా పరిష్కారం వెతుకుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లోకోయి మహదేవ్, ప్రధాన కార్యదర్శి పాంగి రాజు, నాయకులు రామచందర్ కిరణ్, సుబ్బారావు, భీమన్న, జగన్, బాలరాజు, ఆనంద్, సోన్ను,శంకర్ రావు, అరకు అసెంబ్లీ మీడియా కో ఆర్డినేటర్ బాలు దొర, శేఖర్, కొర్ర బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

