Saturday, 28 March 2026
  • Home  
  • మాజీ మంత్రి గొల్లపల్లి. జోగి రమేష్ గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మాజీ మంత్రి గొల్లపల్లి. జోగి రమేష్ గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను

మాజీ మంత్రి జోగి రమేష్ గారి అరెస్టు పూర్తిగా అక్రమం, ఇది రాజకీయ కక్షసాధింపు చర్య – మాజీ మంత్రి గొల్లపల్లి. జోగి రమేష్ గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనను డైవర్ట్ చేయడానికే ఈ అరెస్టు. కక్షసాధింపు చర్యలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు. మాజీ మంత్రి, బీసీ నేత జోగి రమేష్ గారిని కల్తీ మద్యం కేసులో అరెస్టు చేయడం అత్యంత అన్యాయం, రాజకీయ దురుద్దేశపూర్వక చర్య అని, ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయమని మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ గొల్లపల్లి సూర్యారావు గారు అన్నారు నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ గారికి ఏ విధమైన సంబంధం లేకపోయినా, కూటమి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాల పంథాలో నడుస్తూ, బీసీ వర్గానికి చెందిన నాయకుడిని లక్ష్యంగా చేసుకుందని గొల్లపల్లి విమర్శించారు. జోగి రమేష్ గారు ఇప్పటికే విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేసి తన నిర్దోషిత్వాన్ని ప్రజల ముందు నిరూపించారు. అయినప్పటికీ, చంద్రబాబు ప్రభుత్వం తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ అక్రమ అరెస్టు నాటకం ఆడుతోందని ఆమె అన్నారు. గత 18 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ కాలంలోనే బయటపడిన నకిలీ మద్యం, లిక్కర్ మాఫియా వ్యవహారాలు బహిర్గతమయ్యాయి. పట్టుబడ్డవారిలో టీడీపీకి చెందిన నేతలు, అభ్యర్థులు, మంత్రులు, లోకేష్‌కు సన్నిహితులు ఉన్నప్పటికీ, వారిపై ఏ చర్యలూ తీసుకోలేదని సూర్యారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని లిక్కర్ స్కామ్‌లను సృష్టించి, తప్పుడు విచారణలు జరిపి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వానికి రాజకీయ పద్ధతిగా మారిందని పేర్కొన్నారు. ఇదంతా కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ వైఫల్యాన్ని, అలాగే మొంథా తుపాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతుల గోడును ప్రజల దృష్టి నుండి మళ్లించడానికే చేసిన కుట్ర అని సూర్యారావు గారు విమర్శించారు.

మాజీ మంత్రి జోగి రమేష్ గారి అరెస్టు పూర్తిగా అక్రమం, ఇది రాజకీయ కక్షసాధింపు చర్య – మాజీ మంత్రి గొల్లపల్లి.
జోగి రమేష్ గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను
కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనను డైవర్ట్ చేయడానికే ఈ అరెస్టు. కక్షసాధింపు చర్యలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు.
మాజీ మంత్రి, బీసీ నేత జోగి రమేష్ గారిని కల్తీ మద్యం కేసులో అరెస్టు చేయడం అత్యంత అన్యాయం, రాజకీయ దురుద్దేశపూర్వక చర్య అని, ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయమని మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ గొల్లపల్లి సూర్యారావు గారు అన్నారు
నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ గారికి ఏ విధమైన సంబంధం లేకపోయినా, కూటమి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాల పంథాలో నడుస్తూ, బీసీ వర్గానికి చెందిన నాయకుడిని లక్ష్యంగా చేసుకుందని గొల్లపల్లి విమర్శించారు.
జోగి రమేష్ గారు ఇప్పటికే విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేసి తన నిర్దోషిత్వాన్ని ప్రజల ముందు నిరూపించారు. అయినప్పటికీ, చంద్రబాబు ప్రభుత్వం తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ అక్రమ అరెస్టు నాటకం ఆడుతోందని ఆమె అన్నారు. గత 18 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ కాలంలోనే బయటపడిన నకిలీ మద్యం, లిక్కర్ మాఫియా వ్యవహారాలు బహిర్గతమయ్యాయి. పట్టుబడ్డవారిలో టీడీపీకి చెందిన నేతలు, అభ్యర్థులు, మంత్రులు, లోకేష్‌కు సన్నిహితులు ఉన్నప్పటికీ, వారిపై ఏ చర్యలూ తీసుకోలేదని సూర్యారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
లేని లిక్కర్ స్కామ్‌లను సృష్టించి, తప్పుడు విచారణలు జరిపి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వానికి రాజకీయ పద్ధతిగా మారిందని పేర్కొన్నారు. ఇదంతా కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ వైఫల్యాన్ని, అలాగే మొంథా తుపాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతుల గోడును ప్రజల దృష్టి నుండి మళ్లించడానికే చేసిన కుట్ర అని సూర్యారావు గారు విమర్శించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.