సీతారామపురం ఆగస్టు(పున్నమి ప్రతినిధి )
మాజీమంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి యూత్ వింగ్ జాయింట్ సెక్రటరీ శనివారం నెల్లూరులోని కాకాణి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం పలు రాజకీయ అంశాలపై ఇరువురు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ముద్దు కృష్ణంరాజు మాట్లాడుతూ మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై కూటమి ప్రభుత్వం పెట్టిన అన్ని అక్రమ కేసుల పై బెయిల్ రావడం సంతోషంగా ఉందని త్వరలోనే కడిగిన ముత్యంలా అన్ని కేసులు కొట్టివేయబడతాయని న్యాయస్థానంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి విసిరిన సవాళ్లను స్వీకరిస్తూ కావలి పర్యటనకు సిద్ధమైన మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలను హౌస్ అరెస్టులు చేయడం దారుణమని కూటమి ప్రభుత్వ నాయకులు పిరికిపందల్లా వ్యవహరిస్తూ సవాల్లను విసడమే గాని సవాలను స్వీకరించే దమ్ము కూటమి నాయకులకు లేదన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తమ అక్రమాలు దౌర్జన్యాలను కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా నిర్వహిస్తుందని రాష్ట్ర ప్రజలందరూ కూటమి పాలన అరాచకాలను గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూటమి ప్రభుత్వానికి పరాభవం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో పామూరు మండల యూత్ జనరల్ సెక్రటరీ ఇర్రి వినోద్ రెడ్డి,సీతారామపురం వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి కప్ప పృద్వి తదితరులు పాల్గొన్నారు.


