కామారెడ్డి, 2 అక్టోబర్, పున్నమి ప్రతినిధి :
రామారెడ్డి మండల కేంద్రంలో డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమి టీ (డిసిసి) అధ్యక్షుడు కైలా శ్రీనివాస్ జన్మదిన వేడుకలను స్థానిక కాంగ్రెస్ నాయకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. మాజీ జడ్పిటిసి ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడు కలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు రాత్రి సమయంలో సమావేశమై, తమ ప్రియతమ అధ్యక్షులు కైలా శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినంద నలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, రెండు కొవ్వొత్తులు వెలిగించి, అభిమానంగా ఆయ నకు జయస్మరణ చేశారు.ఈ కార్యక్రమానికి హాజ రైన కాంగ్రెస్ నేతలు కండువాలు ధరించి పార్టీ సంప్రదాయాన్ని ప్రతిబింబించారు. మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ జన్మదిన వేడు కల ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ నాయ కుడిపై ఉన్న మద్దతును, గౌరవాన్ని మరోసారి చాటుకున్నారు. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని ఈ జన్మదినోత్సవాన్ని విజయవంతం చేశారు.

