*రామవరప్పాడు లో వైఎస్ఆర్సిపి నాయకుల సందడి
రామవరప్పాడు: అక్టోబర్ 21 పున్నమి వినోద్.
గన్నవరం మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్సిపి నాయకులు వల్లభనేని వంశీ మోహన్ జన్మదిన వేడుకలు రామవరప్పాడు లో వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.
రామవరప్పాడు లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నాయకులు కేక్ కట్ చేసి, తమ ప్రియతమ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈవేడుకలో సమ్మెట సాంబశివరావు,సమ్మెట లక్ష్మి,కూనపరెడ్డి సీతయ్య మెండే సుధాకర్,నూకల పుల్లయ్య, ఉప్పు నాగరాజు,రాచమల్ల నాగభూషణం,కర్నే గోవిందు,శనాపతి నారాయణ, బిరుదుగడ్డ దానియేలు,గాడిలీ రాజేష్,ఈదర నాగేశ్వరరావు,కొల్లు రమేష్, శిఖ ఆజాద్, కూనపరెడ్డి శివ,నాని,సత్తిబాబు, సంజీవ్ తో పాటు పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పై తమకున్న అభిమానాన్ని,విశ్వాసాన్ని చాటుతూ,వారు ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యంతో పాటు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ వేడుకలు రామవరప్పాడు వైఎస్ఆర్సిపి శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి.


