Tuesday, 24 March 2026
  • Home  
  • మాఘామావాస్య స్నానాలకు సర్వం సిద్దం
- కామారెడ్డి

మాఘామావాస్య స్నానాలకు సర్వం సిద్దం

కామారెడ్డి, 16 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : మాఘమం అమావాస్య స్నానాలకు సర్వం సిద్దం చేశారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, మద్దికుంట గ్రామ శివారులో ప్రకృతి సౌందర్యంతో కూడిన స్వయంభు శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆల యంలో మాఘ అమావాస్య (మౌని అమావాస్య) సందర్భంగా భక్తులకు పవిత్ర స్నాన ఘట్టా పూర్తి సౌకర్యాలతో సిద్ధం అయింది. దట్ట అడవుల మధ్య గ్రామం నుంచి సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో మంచినీటి వద్ద ఘనంగా భాగమామాస్య స్నానాలు జరిగేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపా రు.ఆలయ చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ,భక్తుల సౌకర్యం కోసం పూర్తి సౌకర్యాలతో ఘట్టాన్ని సన్న ద్ధం చేశామన్నారు.పవిత్ర స్నానాల ద్వారా పాపా లు తొలగి పూర్వీకుల ఆశీస్సులు కలుగుతాయని అని తెలిపారు.ఆలయ ప్రధాన అర్చకులు ప్రభు స్వామి మాట్లాడుతూ, గొప్ప చరిత్ర స్వయంభు లింగంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం బుగ్గలో (జి లాల్లో) వెలిసింది,రామలింగేశ్వర స్వామి అనుగ్ర హం భక్తులు పొందుతున్నారు.గ్రామ పెద్దలు,దాత ల సహకారంతో నూతన మందిర నిర్మాణం,మంగ ళ గౌరి అమ్మవారి ప్రతిష్ఠాపన జరిగి,ఏటా శివరాత్రి, మాఘ అమావాస్య వంటి పండుగల్లో జాతరలు జరుగుతున్నాయి. ప్రకృతి ఒడిలో కనిపించే ఈ ఆలయం ప్రాంతీయ భక్తులకు ప్రత్యేక ఆకర్షణ. మాఘ అమావాస్య మహత్త్వం పురాణాల ప్రకారం మానవ మూలపురుషుడు మనువు జన్మించిన తిథి మాఘ అమావాస్య,సూర్య దేవుడు ఆవిర్భ వించిన రోజు.ఈ రోజు మౌనవ్రతం పాటించడం, పవిత్ర స్నానాలు, పూర్వీకుల తర్పణాలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక శుద్ధి, మానసిక ప్రశాంతత,కు టుంబ శ్రేయస్సు కలుగుతాయని భక్తుల విశ్వాసం. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లో గంగాది నదులు, పుణ్యక్షేత్రాల్లో ఈ రోజు ఘనోత్సవాలు జరుగుతా యి.ప్రధాన వేడుకల వివరాలు పవిత్ర స్నానాలు మంచినీటిలో భాగమామాస్య స్నానం పాపాలను నాశనం చేస్తుంది, భక్తుల రద్దీకి సౌకర్యాలు. పూర్వీ కుల పూజ: తర్పణం, పిండప్రదానం ద్వారా ఆత్మ శాంతి కోరుకుంటారు.మౌనవ్రతం: ‘మౌని’ అమావా స్య కాబట్టి రోజంతా మౌనంగా దైవ చింతన. దాన ధర్మాలు: నువ్వులు, తిలాలు, దుస్తులు, భోజనం దానాలు పుణ్యకరం.సూర్యారాధన: సూర్యోదయం లో అర్ఘ్య ప్రదానం, సూర్య ఆలయ దర్శనాలు. ప్రత్యేక ఉత్సవాలు: ఆలయంలో అభిషేకాలు, తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.తేదీలు.. తెలుగు పంచాంగం ప్రకారం 2026 మాఘ అమావాస్య జనవరి 18న ఆదివారం రోజు 00:03 గంటలకు ప్రారంభమై, 19 జనవరి 01:21కు ముగుస్తుంది. కామారెడ్డి జిల్లాలో మద్దికుంటతో పాటు సింహాచ లం, ఏడుపాయల వంటి క్షేత్రాల్లో భక్తుల రద్దీ పెరిగేందుకు పోలీస్ బందోబస్తు, రవాణా, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రాంతీయ భక్తులు, స్థానికులు తండోపతండాలుగా తరలివచ్చి పాల్గొంటారు.

కామారెడ్డి, 16 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) :

మాఘమం అమావాస్య స్నానాలకు సర్వం సిద్దం చేశారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, మద్దికుంట గ్రామ శివారులో ప్రకృతి సౌందర్యంతో కూడిన స్వయంభు శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆల యంలో మాఘ అమావాస్య (మౌని అమావాస్య) సందర్భంగా భక్తులకు పవిత్ర స్నాన ఘట్టా పూర్తి సౌకర్యాలతో సిద్ధం అయింది. దట్ట అడవుల మధ్య గ్రామం నుంచి సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో మంచినీటి వద్ద ఘనంగా భాగమామాస్య స్నానాలు జరిగేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపా రు.ఆలయ చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ,భక్తుల సౌకర్యం కోసం పూర్తి సౌకర్యాలతో ఘట్టాన్ని సన్న ద్ధం చేశామన్నారు.పవిత్ర స్నానాల ద్వారా పాపా లు తొలగి పూర్వీకుల ఆశీస్సులు కలుగుతాయని అని తెలిపారు.ఆలయ ప్రధాన అర్చకులు ప్రభు స్వామి మాట్లాడుతూ, గొప్ప చరిత్ర స్వయంభు లింగంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం బుగ్గలో (జి లాల్లో) వెలిసింది,రామలింగేశ్వర స్వామి అనుగ్ర హం భక్తులు పొందుతున్నారు.గ్రామ పెద్దలు,దాత ల సహకారంతో నూతన మందిర నిర్మాణం,మంగ ళ గౌరి అమ్మవారి ప్రతిష్ఠాపన జరిగి,ఏటా శివరాత్రి, మాఘ అమావాస్య వంటి పండుగల్లో జాతరలు జరుగుతున్నాయి. ప్రకృతి ఒడిలో కనిపించే ఈ ఆలయం ప్రాంతీయ భక్తులకు ప్రత్యేక ఆకర్షణ. మాఘ అమావాస్య మహత్త్వం పురాణాల ప్రకారం మానవ మూలపురుషుడు మనువు జన్మించిన తిథి మాఘ అమావాస్య,సూర్య దేవుడు ఆవిర్భ వించిన రోజు.ఈ రోజు మౌనవ్రతం పాటించడం, పవిత్ర స్నానాలు, పూర్వీకుల తర్పణాలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక శుద్ధి, మానసిక ప్రశాంతత,కు టుంబ శ్రేయస్సు కలుగుతాయని భక్తుల విశ్వాసం. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లో గంగాది నదులు, పుణ్యక్షేత్రాల్లో ఈ రోజు ఘనోత్సవాలు జరుగుతా యి.ప్రధాన వేడుకల వివరాలు పవిత్ర స్నానాలు మంచినీటిలో భాగమామాస్య స్నానం పాపాలను నాశనం చేస్తుంది, భక్తుల రద్దీకి సౌకర్యాలు. పూర్వీ కుల పూజ: తర్పణం, పిండప్రదానం ద్వారా ఆత్మ శాంతి కోరుకుంటారు.మౌనవ్రతం: ‘మౌని’ అమావా స్య కాబట్టి రోజంతా మౌనంగా దైవ చింతన. దాన ధర్మాలు: నువ్వులు, తిలాలు, దుస్తులు, భోజనం దానాలు పుణ్యకరం.సూర్యారాధన: సూర్యోదయం లో అర్ఘ్య ప్రదానం, సూర్య ఆలయ దర్శనాలు. ప్రత్యేక ఉత్సవాలు: ఆలయంలో అభిషేకాలు, తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.తేదీలు.. తెలుగు పంచాంగం ప్రకారం 2026 మాఘ అమావాస్య జనవరి 18న ఆదివారం రోజు 00:03 గంటలకు ప్రారంభమై, 19 జనవరి 01:21కు ముగుస్తుంది. కామారెడ్డి జిల్లాలో మద్దికుంటతో పాటు సింహాచ లం, ఏడుపాయల వంటి క్షేత్రాల్లో భక్తుల రద్దీ పెరిగేందుకు పోలీస్ బందోబస్తు, రవాణా, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రాంతీయ భక్తులు, స్థానికులు తండోపతండాలుగా తరలివచ్చి పాల్గొంటారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.