నందిగామ పట్టణంలోని కాకాని నగర్‌లో ఉన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో సోమవారం ఒక కార్యక్రమం జరిగింది.
చందర్లపాడు మండలం కోనాయపాలెం గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థి వల్లపు అరవింద్, నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న మాక్ అసెంబ్లీలో పాల్గొనడానికి ఎంపికైనందుకు ఎమ్మెల్యే సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య అరవింద్‌ను శాలువాతో సత్కరించి, పుష్ప గుచ్ఛం అందజేశారు. “ఇది మీ ప్రతిభకు గుర్తింపు.భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలనిఆశిస్తున్నాను” అని ఆమె అభినందించారు.
అరవింద్‌కి ఈ విజయావకాశం కల్పించిన ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థు ల్లో ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించడంలో దోహదపడతాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.

మాక్ అసెంబ్లీలో ఎంపికైన విద్యార్థిని సత్కరించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ పట్టణంలోని కాకాని నగర్‌లో ఉన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో సోమవారం ఒక కార్యక్రమం జరిగింది. చందర్లపాడు మండలం కోనాయపాలెం గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థి వల్లపు అరవింద్, నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న మాక్ అసెంబ్లీలో పాల్గొనడానికి ఎంపికైనందుకు ఎమ్మెల్యే సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య అరవింద్‌ను శాలువాతో సత్కరించి, పుష్ప గుచ్ఛం అందజేశారు. “ఇది మీ ప్రతిభకు గుర్తింపు.భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలనిఆశిస్తున్నాను” అని ఆమె అభినందించారు. అరవింద్‌కి ఈ విజయావకాశం కల్పించిన ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థు ల్లో ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించడంలో దోహదపడతాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.

