నాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని అరవపల్లి శ్రీ శ్రీ శ్రీ హజరత్ ఖాదర్‌వల్లి వాలి దర్గా షరీఫ్ లో ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఉరుస్ మహోత్సవం ఈ నెల 28, 29 నవంబర్ 2025 తేదీల్లో ఘనంగా జరగనుంది. మహోత్సవాన్ని పురస్కరించుకుని దర్గా పరిసరాలు పండుగ వాతావరణంలో ముస్తాబయ్యాయి. వక్ఫ్ బోర్డ్ మాజీ ప్రధాన కార్యదర్శి దర్గా కమిటీ సభ్యుడు సయ్యద్ అమీర్ మాట్లాడుతూ,
“ఈ పవిత్ర ఉరుస్ మహోత్సవం కులమతాలకి అతీతం.ప్రేమ,శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే ఈ దర్గా శరీఫ్‌కు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే.ఏ మతానికి చెందినవారైనా భక్తిశ్రద్ధలతో వచ్చి పాల్గొని దర్గా దీవెనలు పొందాలని కోరుతున్నాము” అన్నారు.
మహోత్సవ కార్యక్రమాలు
28-11-2025 శుక్రవారం
మహోత్సవ ప్రారంభం ప్రత్యేక ప్రార్థనలు గంధము కార్యక్రమము
దర్గా వద్ద దువా 29-11-2025 శనివారం ఫతేహా సజ్జాదానషీన్ సంప్రదాయ కార్యక్రమాలు అన్నప్రసాదాల పంపిణీ భక్తులందరికీ ప్రత్యేక ప్రార్థనలు మహోత్సవానికి సంబంధించి వైద్య సేవలు, నీటి సదుపాయం,విద్యుత్, భక్తులకోసం ప్రత్యేక ఆసనాలు, పార్కింగ్ వంటి ఏర్పాట్లను స్థానిక కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు.పెద్దఎత్తున భక్తులు పాల్గొనే అవకాశముండడంతో భద్రతా ఏర్పాట్లు కూడా బలోపేతం చేసినట్లు కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా దర్గా కమిటీ అధ్యక్షుడు కమల్ భాష మాట్లాడుతూ
“మనందరం శాంతి, సామరస్యం,ప్రేమతో కూడిన సమాజ నిర్మాణానికి అంకితమైన వారము అని.ఈ ఉరుస్ మహోత్సవం కూడా అదే సందేశాన్ని అందిస్తుంది అని.అందువల్ల ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి తప్పకుండా పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేయాలి” అని తెలిపారు.

మహోత్సవానికి ముస్తాబైన దర్గా :- కుల మతాలకతీతంగా ఉరుస్ మహోత్సవానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే :- సయ్యద్ అమీర్
నాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని అరవపల్లి శ్రీ శ్రీ శ్రీ హజరత్ ఖాదర్‌వల్లి వాలి దర్గా షరీఫ్ లో ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఉరుస్ మహోత్సవం ఈ నెల 28, 29 నవంబర్ 2025 తేదీల్లో ఘనంగా జరగనుంది. మహోత్సవాన్ని పురస్కరించుకుని దర్గా పరిసరాలు పండుగ వాతావరణంలో ముస్తాబయ్యాయి. వక్ఫ్ బోర్డ్ మాజీ ప్రధాన కార్యదర్శి దర్గా కమిటీ సభ్యుడు సయ్యద్ అమీర్ మాట్లాడుతూ, “ఈ పవిత్ర ఉరుస్ మహోత్సవం కులమతాలకి అతీతం.ప్రేమ,శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే ఈ దర్గా శరీఫ్‌కు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే.ఏ మతానికి చెందినవారైనా భక్తిశ్రద్ధలతో వచ్చి పాల్గొని దర్గా దీవెనలు పొందాలని కోరుతున్నాము” అన్నారు. మహోత్సవ కార్యక్రమాలు 28-11-2025 శుక్రవారం మహోత్సవ ప్రారంభం ప్రత్యేక ప్రార్థనలు గంధము కార్యక్రమము దర్గా వద్ద దువా 29-11-2025 శనివారం ఫతేహా సజ్జాదానషీన్ సంప్రదాయ కార్యక్రమాలు అన్నప్రసాదాల పంపిణీ భక్తులందరికీ ప్రత్యేక ప్రార్థనలు మహోత్సవానికి సంబంధించి వైద్య సేవలు, నీటి సదుపాయం,విద్యుత్, భక్తులకోసం ప్రత్యేక ఆసనాలు, పార్కింగ్ వంటి ఏర్పాట్లను స్థానిక కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు.పెద్దఎత్తున భక్తులు పాల్గొనే అవకాశముండడంతో భద్రతా ఏర్పాట్లు కూడా బలోపేతం చేసినట్లు కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా దర్గా కమిటీ అధ్యక్షుడు కమల్ భాష మాట్లాడుతూ “మనందరం శాంతి, సామరస్యం,ప్రేమతో కూడిన సమాజ నిర్మాణానికి అంకితమైన వారము అని.ఈ ఉరుస్ మహోత్సవం కూడా అదే సందేశాన్ని అందిస్తుంది అని.అందువల్ల ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి తప్పకుండా పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేయాలి” అని తెలిపారు.

