పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 26 : మండల కేంద్రంలో బుధవారం బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింస, హత్యలు, అవమానాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ వీహెచ్పీ (విశ్వ హిందూ పరిషత్), బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.అంబేద్కర్ విగ్రహం నుంచి పై చౌరస్తా వరకు ర్యాలీగా సాగిన కార్యకర్తలు, బంగ్లాదేశ్‌లో జిహాదులు హిందువులపై చేస్తున్న దౌర్జన్యాలను ఖండిస్తూ నినాదాలు చేశారు. అనంతరం బంగ్లాదేశ్ జిహాదుల దిష్టిబొమ్మను దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యలు, ఆలయాల విధ్వంసం తక్షణమే ఆగాలని డిమాండ్ చేశారు. హిందువుల రక్షణ కోసం అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని, భారత ప్రభుత్వం ఈ అంశంపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ నిరసన కార్యక్రమంలో వీహెచ్పీ, బజరంగ్‌దళ్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక హిందూ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
* మహేశ్వరం మండల కేంద్రంలో బంగ్లాదేశ్ జిహాదుల దిష్టిబొమ్మ దహనం –వీహెచ్పీ–బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో నిరసన *