పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 15 : మహేశ్వరం నియోజకవర్గంలో శనివారం విస్తృతంగా పర్యటించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. తొలుత ఉదయమే కార్యాలయానికి చేరుకున్న కిచ్చెన్న… ప్రజాసమస్యలు, పార్టీ సంస్థగత ఎన్నికలు, జూబ్లీహిల్స్ విజయంపై హస్తం నేతలతో చర్చించారు. నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేసిన నాయకులను అభినందించారు.అనంతరం మహేశ్వరం మండలం ఎన్ డి తండాలో గ్రామపంచాయతీ బిల్డింగ్ కు భూమి పూజ చేశారు.అమీర్ పేటలో కొలువై ఉన్న విశిష్ట దేవాలయం శ్రీ వేంకటేశ్వర స్వామి 17వ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని దేవదేవుడికి పూజలు చేశారు.ఇమామ్ గూడ ఫంక్షన్ హాల్ లో జరిగిన పార్టీ కార్యకర్త వివాహానికి హాజరయ్యారు.సాగర్ హైవే రాగన్నగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎ వి ఎస్ హాస్పటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.గుర్రంగూడలో కాంగ్రెస్ సీనియర్ నేత గుర్రం లక్ష్మారెడ్డి గుండెపోటుతో మరణించటంతో నివాళి అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తర్వాత తుక్కుగూడ కార్యాలయానికి చేరుకుని త్వరలో జరగనున్న సర్పంచ్ ఎన్నికలపై నేతలతో సుధీర్ఘంగా చర్చించారు.

* మహేశ్వరం నియోజకవర్గంలో కె ఎల్ ఆర్ విస్తృత పర్యటన —జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ విజయంపై ఆనందోత్సవాలు*