Monday, 8 December 2025
  • Home  
  • మహిళా ఐక్య వేదిక కార్యవర్గ సమావేశం
- E-పేపర్

మహిళా ఐక్య వేదిక కార్యవర్గ సమావేశం

కర్నూలు జిల్లా యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక ప్రధాన కార్యాలయంలో రాయలసీమ డివిజన్ అధ్యక్షురాలు భారతమ్మ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంది విజయలక్ష్మి మాట్లాడుతూ కమిటీ సభ్యులు నడుచు కోవలసిన పద్ధతులపై మహిళా ఐక్య వేదిక విధి విధానాలను వివరించి మహిళా ఐక్య వేదికను నిజాయితీతో నిబద్ధతతో ముందుకు తీసుకెళ్లాలని ఆమె కార్యవర్గాన్ని కోరారు. కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లాలోని అన్ని మండలాల్లో మహిళా ఐక్య వేదిక కమిటీ నిర్మాణాలు చేపట్టాలని, మహిళా ఐక్య వేదిక బలోపేతానికి సభ్యులు శ్రమించాలని మండల జిల్లా ల కమిటీకి తెలియజేశారు. అలాగే మహిళలు తమ ఆత్మగౌరవం, హక్కులకై నిరంతరం పోరాడాల్సిన పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఉందని, మరోవైపు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు, హత్యలకు, దాడులకు, వ్యతిరేకంగా మహిళలంతా ఏకమై పోరాటాలకు సిద్ధం కావాలని ఆమె మహిళా ఐక్య వేదిక సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కటిక భాను, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షురాలు ఆకుతోట పద్మావతి, కర్నూలు జిల్లా ఉపాధ్యక్షురాలు ఉసేన్ బీ,కోడుమూరు మండల అధ్యక్షురాలు దస్తగిరమ్మ, బేతంచర్ల మండల అధ్యక్షురాలు కోమ్ము పెద్దక్క, షేకున్ బి,లక్ష్మేశ్వరి,కన్యాకుమారి, షేక్ ఇస్మాత్, ఖాజా బి,తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.