Friday, 6 February 2026
  • Home  
  • మహిళలు ఉత్పత్తి రంగంలో రాణించాలి జిల్లా ఉపాధి అధికారి ప్రసాద్
- E-పేపర్

మహిళలు ఉత్పత్తి రంగంలో రాణించాలి జిల్లా ఉపాధి అధికారి ప్రసాద్

మహిళలు ఉత్పత్తి రంగంలో రాణించాలి జిల్లా ఉపాధి అధికారి ప్రసాద్ రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వేకోడూరు స్థానిక గిరిజమ్మ వీధిలోని గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని జిల్లా ఉపాధి అధికారి కె.సురేష్ సందర్శించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతికి వస్తున్నాం105వ టైలరింగ్ బ్యాచ్ లో శిక్షణ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన శిక్షణ పొందుతున్న మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ మీ ప్రతిభ మీరు కుట్టిన దుస్తులతో చూపించాలన్నారు. ఉన్నతమైన ఆశయాలను కలిగి, కొత్త పద్ధతులతో వ్యాపార రంగంలో రాణించాలన్నారు. ఫుడ్ ప్రొడక్ట్స్, గార్మెంట్స్, బ్యూటీ పార్లర్ కేంద్రాలు, డైరీ యూనిట్లు మొదలగు రంగాలలో విజయం సాధిచిన వారిని ఆదర్శంగా తీసుకుని మహిళా పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. నారీ శక్తి వంటి పథకాలు ఉపయోగించుకోవలన్నారు. ట్రస్ట్ చైర్మన్ కె.పార్థసారధి మాట్లాడుతూ సంక్రాంతికి టైలర్లుగా తీర్చిదిద్దే విధంగా శిక్షణ ఇస్తున్నామని అందరూ శ్రద్ధగా నేర్చుకుంటున్నారని వారిని ప్రోత్సహించుటకు కుట్టిన బట్టలు ప్రదర్శించి ఓటింగ్ పద్ధతి ద్వారా మొదటి మూడు స్థానాలు పొందిన వారికి బహుమతులు అందజేస్తున్నామన్నారు. ముఖ్య అతిధి జిల్లా ఉపాధి అధికారి కె.సురేష్ చేతుల మీదుగా మొదటి గ్రూపులో మొదటి మూడు స్థానాలు పొందిన సుమలత, ప్రత్యూష, ముస్కినా లకు, రెండవ గ్రూపులో మొదటి మూడు స్థానాలు పొందిన తస్లీమా, కావ్య, మౌనిక లకు బహుమతులు అందజేశారు. అనంతరం జిల్లా ఉపాధి అధికారిని మహిళలు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ట్రస్ట్ కో ఆర్డినేటర్ ముస్కినా, ట్రైనర్ కావ్య, మహిళలు పాల్గొన్నారు.

మహిళలు ఉత్పత్తి రంగంలో రాణించాలి
జిల్లా ఉపాధి అధికారి ప్రసాద్

రైల్వేకోడూరు మేజర్ న్యూస్

రైల్వేకోడూరు స్థానిక గిరిజమ్మ వీధిలోని గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని జిల్లా ఉపాధి అధికారి కె.సురేష్ సందర్శించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతికి వస్తున్నాం105వ టైలరింగ్ బ్యాచ్ లో శిక్షణ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన శిక్షణ పొందుతున్న మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ మీ ప్రతిభ మీరు కుట్టిన దుస్తులతో చూపించాలన్నారు. ఉన్నతమైన ఆశయాలను కలిగి, కొత్త పద్ధతులతో వ్యాపార రంగంలో రాణించాలన్నారు. ఫుడ్ ప్రొడక్ట్స్, గార్మెంట్స్, బ్యూటీ పార్లర్ కేంద్రాలు, డైరీ యూనిట్లు మొదలగు రంగాలలో విజయం సాధిచిన వారిని ఆదర్శంగా తీసుకుని మహిళా పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. నారీ శక్తి వంటి పథకాలు ఉపయోగించుకోవలన్నారు. ట్రస్ట్ చైర్మన్ కె.పార్థసారధి మాట్లాడుతూ సంక్రాంతికి టైలర్లుగా తీర్చిదిద్దే విధంగా శిక్షణ ఇస్తున్నామని అందరూ శ్రద్ధగా నేర్చుకుంటున్నారని వారిని ప్రోత్సహించుటకు కుట్టిన బట్టలు ప్రదర్శించి ఓటింగ్ పద్ధతి ద్వారా మొదటి మూడు స్థానాలు పొందిన వారికి బహుమతులు అందజేస్తున్నామన్నారు. ముఖ్య అతిధి జిల్లా ఉపాధి అధికారి కె.సురేష్ చేతుల మీదుగా మొదటి గ్రూపులో మొదటి మూడు స్థానాలు పొందిన సుమలత, ప్రత్యూష, ముస్కినా లకు, రెండవ గ్రూపులో మొదటి మూడు స్థానాలు పొందిన తస్లీమా, కావ్య, మౌనిక లకు బహుమతులు అందజేశారు. అనంతరం జిల్లా ఉపాధి అధికారిని మహిళలు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ట్రస్ట్ కో ఆర్డినేటర్ ముస్కినా, ట్రైనర్ కావ్య, మహిళలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.