Friday, 27 March 2026
  • Home  
  • మహిళలను కోటీశ్వరులను చేస్తాం –ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి
- నాగర్‌కర్నూల్

మహిళలను కోటీశ్వరులను చేస్తాం –ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 16 తెలంగాణ ఇందిరా మహిళా శక్తి, మత్స్యశాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నీలి విప్లవ పథకం కింద సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమం నేడు ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా లబ్ధిదారులైన మహిళలకు చేపల విక్రయ వాహనాలను క్యాంపు కార్యాలయంలో ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు అందజేశారు. ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు మాట్లాడుతూ “మహిళలను కోటీశ్వరులను చేయడం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ప్రజల మధ్యే ఉండి వారి అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తున్న అని పేర్కొన్నారు. “తెలంగాణలో చేపల ఉత్పత్తిని విస్తృతంగా పెంచి, ఇతర రాష్ట్రాలకు మాత్రమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి మత్స్యశాఖను తీసుకువెళ్లడం మా లక్ష్యం. ఈ దిశగా మహిళల సాధికారతకు, మత్స్యకారుల అభివృద్ధికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు గారు,మాజీ కౌన్సిలర్స్ ,లబ్ధిదారులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 16
తెలంగాణ ఇందిరా మహిళా శక్తి, మత్స్యశాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నీలి విప్లవ పథకం కింద సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమం నేడు ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా లబ్ధిదారులైన మహిళలకు చేపల విక్రయ వాహనాలను క్యాంపు కార్యాలయంలో ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు అందజేశారు.
ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు మాట్లాడుతూ “మహిళలను కోటీశ్వరులను చేయడం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ప్రజల మధ్యే ఉండి వారి అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తున్న అని పేర్కొన్నారు.
“తెలంగాణలో చేపల ఉత్పత్తిని విస్తృతంగా పెంచి, ఇతర రాష్ట్రాలకు మాత్రమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి మత్స్యశాఖను తీసుకువెళ్లడం మా లక్ష్యం. ఈ దిశగా మహిళల సాధికారతకు, మత్స్యకారుల అభివృద్ధికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు గారు,మాజీ కౌన్సిలర్స్ ,లబ్ధిదారులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.