Monday, 16 February 2026
  • Home  
  • మహా శివరాత్రి సందర్భంగా యోగిమల్లవరంలో శ్రీ పరాశరేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి
- తిరుపతి

మహా శివరాత్రి సందర్భంగా యోగిమల్లవరంలో శ్రీ పరాశరేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

తిరుచానూరు , పున్నమి ప్రతినిధి మహా శివ రాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుచానూరు సమీపంలోని చారిత్రక పుణ్యక్షేత్రం యోగిమల్లవరం శ్రీ పరాశరేశ్వర స్వామి వారిని తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న తుడా చైర్మన్ ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ​మహా శివ రాత్రి పర్వదినాన పురాతనమైన పరాశరేశ్వర స్వామిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ పరమశివుడిని ప్రార్థించినట్లు తెలిపారు. శివరాత్రి సందర్భంగా ఆలయం లో భక్తుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దక్షిణ కాశిగా పేరుగాంచిన ఈ క్షేత్ర అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు తుడా తరపున అవసరమైన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు,కార్యకర్తలు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు,అధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తిరుచానూరు , పున్నమి ప్రతినిధి

మహా శివ రాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుచానూరు సమీపంలోని చారిత్రక పుణ్యక్షేత్రం యోగిమల్లవరం శ్రీ పరాశరేశ్వర స్వామి వారిని తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న తుడా చైర్మన్ ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
​మహా శివ రాత్రి పర్వదినాన పురాతనమైన పరాశరేశ్వర స్వామిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ పరమశివుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
శివరాత్రి సందర్భంగా ఆలయం లో భక్తుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
దక్షిణ కాశిగా పేరుగాంచిన ఈ క్షేత్ర అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు తుడా తరపున అవసరమైన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
​ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు,కార్యకర్తలు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు,అధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.