ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారులకు మరోసారి నిరాశ. నవంబర్ నెలలో కూడా కందిపప్పు పంపిణీ జరగకపోవడం పేదలలో ఆవేదన కలిగించింది.
గత ఏడు నెలలుగా కందిపప్పు సరఫరా నిలిచిపోవడంతో, ప్రజలు పప్పుతో అన్నం తినే పరిస్థితి లేకుండా పోయింది.
ప్రభుత్వం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా పేదలకు నిత్యావసరాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, టెండర్ల జాప్యం, సరఫరా లోపాలు కారణంగా కందిపప్పు ఇవ్వలేకపోతున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు ధర రూ.100–120 కిలోకు చేరడంతో, పేదలు దాన్ని కొనుగోలు చేయడం కష్టమవుతోంది.
రేషన్ డీలర్లు కూడా “స్టాక్ రాలేదు” అంటూ చేతులు ఎత్తేశారు.
కూటమి ప్రభుత్వం మొదట్లో కొద్ది నెలలు పంపిణీ చేసినా, తూకం వివాదాల తర్వాత పంపిణీ నిలిపివేసి విచారణ చేశారు. అప్పటి నుంచి పప్పు పంపిణీ మళ్లీ ప్రారంభం కాలేదు.
తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం నవంబర్ నెల రేషన్‌ను ముందుగానే ప్రారంభించినా, కందిపప్పు మాత్రం అందించలేకపోయింది.
ప్రజలు ప్రభుత్వం వెంటనే స్పందించి, కందిపప్పు సరఫరా పునరుద్ధరించాలనీ కోరుతున్నారు.


