మహబూబ్‌నగర్, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
మహబూబ్‌నగర్ జిల్లా ఇబ్రహీం నగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు కలిసి పాఠశాల ప్రాంగణంలో ఈ పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి టీ. లక్ష్మి, చైర్మన్ AAPC, సభ్యులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో, పూలతో విద్యార్థులు ఆనందంగా నృత్యాలు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. నర్సింలు మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని, విద్యార్థులు సంప్రదాయాల పట్ల ఆకర్షితులు కావాలని తెలిపారు.


