మర్రిపాడు zph స్కూల్ లో సరస్వతి పూజ ఘనంగా నిర్వహించార
మర్రిపాడు :మార్చి 25(పున్నమివిలేకరి )
మర్రిపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులు సరస్వతి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శివ జ్యోతి మాట్లాడుతూ పిల్లలందరూ సరస్వతి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి సంవత్సరం పదో తరగతి విద్యార్థులు వారి యొక్క హాల్టికెట్లను సరస్వతి దేవి ముందు పెట్టి పూజలు నిర్వహిస్తాం కానీ ఈ ఏడాది విద్యార్థులు హాల్ టికెట్లు ఆలస్యం అయిందన్నారు. ఆ మాత అనుగ్రహం తో పదవ తరగతి విద్యార్థులు అందరూ ఉత్తీర్ణులు అవుతారన్నారు. మా స్కూల్ల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిలు మంచి ప్రతిభాపాటవాలు కనబరుస్తున్నారన్నారు. గత ఏడాది పదవ తరగతి విద్యార్థులకు ప్రసన్న రచనప్రతిభ అవార్డులకు ఎంపిక కగా కావలిలో ట్యాబ్ అందజేస్తారని, అలాగే బొమ్మిరెడ్డి వారు సర్టిఫికెట్ నెల్లూరులో అందజేశారని తెలియజేశారు. మగ పిల్లలకంటే ఆడపిల్లలు విద్యలో చక్కగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఇటువంటి విద్యాలయాల ఉండడంవల్ల విద్యార్థినిలు తమ ప్రతిభాపాటవాలను కనబరుస్తున్నారన్నారు. ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలియజేశారు. పాఠశాల వార్షికోత్సవానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆహ్వానించి విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు…