*
*కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు*,
*ఆత్మకూర్ ఏఎంసీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్*
*మర్రిపాడు డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)*
మర్రిపాడుమండల పరిధిలోని ,మర్రిపాడు గ్రామమం సచివాలయంలో రైతన్న మీకోసం కార్యక్రమం మండల వ్యవసాయాధికారి ఎన్ కవిత ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఆత్మకూర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆరికట్ల జనార్దన్ నాయుడు హాజరై, మాట్లాడుతూ. ఐదేళ్లలో రైతులను రాజులుగా చేసేందుకు ప్రభుత్వం ఐదు విధానాలతో అమలు చేయుచున్న కార్యాచరణ వివరాలైన నీటి భద్రత, డిమాండ్ ,ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు మద్దతు ధర గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శిమూలి వెంగయ్య మాట్లాడుతూ గతంలో స్వామినాథం కమిటీ ఇతర దేశాలు వెళ్లి వ్యవసాయం మీద అధ్యయనాలు చేసి రైతులకు మేలు జరిగే విధంగా తెలుసుకొని వచ్చి భారతదేశం మొత్తం మీద వ్యవసాయ రంగానికి ఇలా చేస్తే అభివృద్ధి చెందని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భూమిలేని పేదలకి భూములు పంచి సాగు చేసుకొని జీవించే అవకాశం కల్పించాలని స్వామినాథం కమిటీ దేశానికి నివేదికలు సమర్పించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత సుబ్బయ్య, మాలపాటి వెంకటేశ్వర్లు, మర్రిపాడు మండల బీసీ సెల్ అధ్యక్షుడు గుర్రం నాగేశ్వరరావు, ఇర్లపాడు, ఖాదర్పూర్ ,మర్రిపాడు, పంచాయతీల గ్రామాల రైతులు పాల్గొనడం జరిగినది.


