మర్రిపాడు మండల కేంద్రంలో ఘనంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మర్రిపాడు మండల కేంద్రంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆత్మకూరు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు డబ్బు కొట్టు నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలు సంకల్పం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుందని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డబ్బు కొట్టు నాగరాజు యాదవ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లి ప్రజలకు సేవ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి డబ్బు కొట్టు సునీల్ యాదవ్ కుమార్, డి. నరసింహులు, కార్యకర్తలు మోహన్ రావు, పెంచలయ్య, కిషోర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మర్రిపాడు మండల కేంద్రంలో ఘనంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మర్రిపాడు మండల కేంద్రంలో ఘనంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మర్రిపాడు మండల కేంద్రంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆత్మకూరు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు డబ్బు కొట్టు నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలు సంకల్పం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డబ్బు కొట్టు నాగరాజు యాదవ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లి ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి డబ్బు కొట్టు సునీల్ యాదవ్ కుమార్, డి. నరసింహులు, కార్యకర్తలు మోహన్ రావు, పెంచలయ్య, కిషోర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

