గాజువాక , అక్టోబర్ (పున్నమి ప్రతినిధి):
విశాఖపట్నం నగరంలో గూగుల్ సంస్థ రూ.1,40,000 కోట్ల భారీ పెట్టుబడితో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుండటం రాష్ట్రానికి చారిత్రాత్మక పరిణామంగా అభివర్ణించిన గాజువాక యువత.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరిన నేపథ్యంలో గాజువాక ప్రాంతంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. పాత గాజువాక కూడలిలో యువత బాణాసంచాలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
రాష్ట్రానికి ఈ భారీ ప్రాజెక్టును తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు యువత కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఏపీఐఐసీ డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ మొల్లి పెంట్రాజు, కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు (చిరంజీవి), మార్కెటింగ్ డైరెక్టర్ రంబాయ్, రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయ్, జనసేన సీనియర్ నాయకులు గంధం వెంకట్రావు, కరణం కనకారావు, బీజేపీ నాయకులు కృష్ణంరాజు, గాజువాక తెలుగు యువత అధ్యక్షులు ఎం. గణపతి, ప్రధాన కార్యదర్శి బియ్యపు నరేష్ పాల్గొన్నారు.
మహిళలు, యువతతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హర్షోత్సాహాలతో ఈ కార్యక్రమంలో పాల్గొని, “మన విశాఖ మరో హైటెక్ సిటీగా అవతరించబోతోందని” ఉత్సాహంగా పేర్కొన్నారు.


