Sunday, 7 December 2025
  • Home  
  • మమ్మల్ని భారం అనుకోవద్దు.. భాగస్వాములుగా గౌరవించండి ఎన్పి ఆర్డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగ రెడ్డి షాద్ నగర్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు
- రంగారెడ్డి

మమ్మల్ని భారం అనుకోవద్దు.. భాగస్వాములుగా గౌరవించండి ఎన్పి ఆర్డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగ రెడ్డి షాద్ నగర్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు

పున్నమి: రంగారెడ్డి జిల్లా: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆపేయ అనురాగాలతో వేడుకలను జరుపుకున్నారు.జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి భుజంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి జేర్కొని రాజు నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో దివ్యాంగ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆశన్నగారి భుజంగారెడ్డి మాట్లాడుతూ…దివ్యాంగులను సమాజం బాధితులుగా కాకుండా సమాన భాగస్వాములుగా గుర్తించాలి. వారికి ఇతరులతో సమాన హక్కులు, అవకాశాలు, గౌరవం లభించాలి. కానీ ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయి.దివ్యాంగుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేస్తూ, సమాన అవకాశాలు కల్పించడంలో ఘోరంగా విఫలమవుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ చరిత్రను గుర్తుచేస్తూ ఆయన మాట్లాడుతూ…1976లో ఐక్యరాజ్యసమితి 1981ని అంతర్జాతీయ దివ్యాంగుల సంవత్సరంగా, 1983-92 మధ్య కాలాన్ని దివ్యాంగుల దశాబ్దంగా ప్రకటించింది. 1992 నుంచి ప్రతి డిసెంబరు 3న ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు.దివ్యాంగుల గౌరవం, హక్కులు, శ్రేయస్సు కోసం అవగాహన పెంచడం, వారిని రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవనంలో భాగస్వాములను చేయడమే ఈ దినోత్సవ లక్ష్యమని వివరించారు.కళలు, విజ్ఞానం, క్రీడలు, ఆవిష్కరణలు , ఏ రంగంలోనైనా దివ్యాంగులు అద్భుతాలు సాధిస్తున్నారు.వారి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే ఈ వేడుకల ఉద్దేశ్యం.కానీ ప్రభుత్వాలు ఈ సామర్థ్యాన్ని గుర్తించకుండా, వివక్షతతో వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల కోసం ప్రకటించిన పథకాలను సంపూర్ణంగా అమలు చేయాలని, వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా నాయకులు మొగదాటి ప్రమోద్, దిర్షిణం శంకర్, మూర్తి, సీమ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

పున్నమి: రంగారెడ్డి జిల్లా: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆపేయ అనురాగాలతో వేడుకలను జరుపుకున్నారు.జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి భుజంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి జేర్కొని రాజు నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో దివ్యాంగ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆశన్నగారి భుజంగారెడ్డి మాట్లాడుతూ…దివ్యాంగులను సమాజం బాధితులుగా కాకుండా సమాన భాగస్వాములుగా గుర్తించాలి. వారికి ఇతరులతో సమాన హక్కులు, అవకాశాలు, గౌరవం లభించాలి. కానీ ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయి.దివ్యాంగుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేస్తూ, సమాన అవకాశాలు కల్పించడంలో ఘోరంగా విఫలమవుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ చరిత్రను గుర్తుచేస్తూ ఆయన మాట్లాడుతూ…1976లో ఐక్యరాజ్యసమితి 1981ని అంతర్జాతీయ దివ్యాంగుల సంవత్సరంగా, 1983-92 మధ్య కాలాన్ని దివ్యాంగుల దశాబ్దంగా ప్రకటించింది. 1992 నుంచి ప్రతి డిసెంబరు 3న ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు.దివ్యాంగుల గౌరవం, హక్కులు, శ్రేయస్సు కోసం అవగాహన పెంచడం, వారిని రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవనంలో భాగస్వాములను చేయడమే ఈ దినోత్సవ లక్ష్యమని వివరించారు.కళలు, విజ్ఞానం, క్రీడలు, ఆవిష్కరణలు , ఏ రంగంలోనైనా దివ్యాంగులు అద్భుతాలు సాధిస్తున్నారు.వారి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే ఈ వేడుకల ఉద్దేశ్యం.కానీ ప్రభుత్వాలు ఈ సామర్థ్యాన్ని గుర్తించకుండా, వివక్షతతో వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల కోసం ప్రకటించిన పథకాలను సంపూర్ణంగా అమలు చేయాలని, వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా నాయకులు మొగదాటి ప్రమోద్, దిర్షిణం శంకర్, మూర్తి, సీమ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.