మండలం మాధవరం-1 గ్రామానికి చెందిన మనఊరికోసం స్వచ్చంద సేవా సంస్ద సభ్యులు అవ్వారు వెంకట వరప్రసాద్ ఏ.వి.యస్.ఓ హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు సతీమణి కీర్తి శేషులు అవ్వారు వెంకటలక్షుమ్మ తృతీయ వర్దంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు వెంకటలక్షుమ్మ పేరు మీద ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనఊరికోసం స్వచ్చంద సేవా సంస్ద ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యుల సహకారంతో పోరుమామిళ్ళ సమీపంలోని వివేకానంద వృద్దాశ్రమంలో వున్న వృద్దులకు, కొత్త మాధవరం సమీపంలోని కాశినాయన వృద్దాశ్రమంలో వృద్దులకు శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా కడప ప్రకాష్ నగర్లోని సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయంలోని 105 మంది నిరుపేద, అనాధ, నిరాశ్రయ పిల్లలకు ఉదయం అల్పాహారం ఏర్పాటు చేశారు. మరియు ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి అన్నదాన సత్రంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనఊరికోసం స్వచ్చంద సంస్థ చైర్మన్ అవ్వారు రవిశంకర్, ఉప్పల రామక్రిష్ణ, విష్ణు వర్దన్, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటలక్షుమ్మ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

మన ఊరికోసం సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు