శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండల పరిధిలో హెల్మెట్ పంపిణీ కార్యక్రమానికి విశేష సహకారం అందించిన స్థానిక నాయకులు, సేవా సంస్థల ప్రతినిధులు మరియు సామాజిక కార్యకర్తలను డీఎస్పీ శ్రీ జి. శ్రీనివాసరావు, సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్సై ఎం.ఎస్. రాకేష్ గార్లు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించారు.
జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన హెల్మెట్ పంపిణీ కార్యక్రమం విజయవంతం కావడంలో వారి సహకారం అభినందనీయమని అధికారులు తెలిపారు. సేవాభావంతో ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి శాలువాలు కప్పి అభినందించారు.
అధికారులు మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత అని, హెల్మెట్ వాడకం ప్రాణాలను కాపాడే కీలక అలవాటు అని ప్రజలకు సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో మనుబోలు టిడిపి నాయకులు రాజా గౌడ్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.


