ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ 09 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం: రైతులకు సబ్సిడీపై విత్తనాల పంపిణీ
గౌరవనీయులైన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మనుబోలు మండలంలో దిత్వా తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శిస్తూ, నారుమళ్లు దెబ్బతిన్న రైతులకు సబ్సిడీపై విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రైతులు ఎదుర్కొన్న నష్టాలను తెలుసుకుని, వారికి తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఎమ్మెల్యే తెలిపారు. రైతుల పంటలు తిరిగి పునరుద్ధరణ పొందేందుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాలు ఎంతో ఉపయోగకరమని ఆయన చెప్పారు.
స్థానిక అధికారులతో కలిసి రైతుల సమస్యలను పరిశీలించి, అవసరమైన సహాయాన్ని త్వరితగతిన అందించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


