Tuesday, 31 March 2026
  • Home  
  • మనుబోలు మండలంలో ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు మండలంలో ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవం

30/11/2025*గిరిజనుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి* *దాతలతో పాటు పారిశ్రామికవేత్తల సహకారంతో గిరిజనకాలనీల్లో అభివృద్ధి పనులు* *ప్రతి పంచాయతీలో మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటే లక్ష్యం* *మనుబోలు పడమర వీధి ఎస్టీ కాలనీతో పాటు అక్కంపేటలో మెట్టు రవీంద్రరెడ్డి ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ల ప్రారంభోత్సవం సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి* గిరిజనులు, పేదలకు ఉపయోగపడే పనులు చేయడం చెన్నూరుకు చెందిన మెట్టు రవీంద్రరెడ్డికి ఎంతో ఇష్టం అందులో భాగంగా పేదలకు ఉపయోగపడేలా ఆర్వో ప్లాంట్లు అందుబాటులోకి తెస్తున్నారు ఇవే గాక రవీంద్రరెడ్డి ఆద్వర్యంలో మరో మూడు ప్లాంట్లు సిద్దమవుతున్నాయి SEIL కంపెనీ కూడా ఒక్కొక్కదానికి రూ.36 లక్షలు వెచ్చించి 14 ప్లాంట్లు ఏర్పాటు చేసింది రూ.7 లక్షల చొప్పున ఖర్చు చేస్తూ మరో 33 ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది ప్రతి పంచాయతీలో మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాం గిరిజనుల అభ్యున్నతిపైనా ప్రత్యేక దృష్టి పెట్టాం ఇప్పటి వరకు 3 వేల మంది గిరిజనులకు ఆధార్ కార్డులు ఇప్పించాం 12 గిరిజన కాలనీలను పామాయిల్ కంపెనీలు దత్తత తీసుకున్నాయి మిగిలిన కాలనీలను కూడా పారిశ్రామికవేత్తలకు దత్తత ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాం టీపీ గూడూరు మండలం మల్లికార్జునపురంలోని 280 కుటుంబాలను SEIL కంపెనీ దత్తత తీసుకుంది ఆ గ్రామంలో ఈ ఏడాది రూ.3 కోట్లు ఖర్చుపెట్టడంతో పాటు వచ్చే ఏడాది నుంచి ఏటా రూ.1.30 కోట్లు ఖర్చుపెడతామని SEIL ప్రకటించింది జెమినీ కంపెనీ బ్రహ్మదేవం గిరిజన కాలనీలో రూ.93 లక్షలతో పనులు ప్రారంభించింది ప్రతి గిరిజన కాలనీలోనూ ఆయా కంపెనీలు యాక్షన్ ప్లాన్ చేపట్టాయి వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏనాడు పేదల కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదు సమాజంలో అత్యంత అమాయకులైన గిరిజనుల అభ్యున్నతిని పూర్తిగా విస్మరించారు వేలాది మందికి కనీసం ఆధార్ కార్డు ఇప్పించలేకపోయారు..సచివాలయాలు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి గిరిజనుల కోసం నిర్మించిన ఇళ్లు కూడా అక్రమాలకు నిలయంగా మారాయి..అత్యంత నాసిరకంగా కట్టారు సర్వేపల్లిలో గిరిజనులకు చెందిన 6 ఎకరాలను కంపెనీలకు అమ్మేసుకున్నారు వావిలేటిపాడులో దళితుల భూములను చెరపెట్టారు ప్రజల కష్టాలను తొలగించకపోగా కొత్తకొత్త సమస్యలు సృష్టించి దోపీడీకి పాల్పడ్డారు కూటమి ప్రభుత్వం పాలనలో పేదలకు ఎంత వరకు సాయం చేయగలమో అంతవరకు శాయశక్తులా చేస్తాం

30/11/2025*గిరిజనుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి*

*దాతలతో పాటు పారిశ్రామికవేత్తల సహకారంతో గిరిజనకాలనీల్లో అభివృద్ధి పనులు*

*ప్రతి పంచాయతీలో మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటే లక్ష్యం*

*మనుబోలు పడమర వీధి ఎస్టీ కాలనీతో పాటు అక్కంపేటలో మెట్టు రవీంద్రరెడ్డి ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ల ప్రారంభోత్సవం సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

గిరిజనులు, పేదలకు ఉపయోగపడే పనులు చేయడం చెన్నూరుకు చెందిన మెట్టు రవీంద్రరెడ్డికి ఎంతో ఇష్టం

అందులో భాగంగా పేదలకు ఉపయోగపడేలా ఆర్వో ప్లాంట్లు అందుబాటులోకి తెస్తున్నారు

ఇవే గాక రవీంద్రరెడ్డి ఆద్వర్యంలో మరో మూడు ప్లాంట్లు సిద్దమవుతున్నాయి

SEIL కంపెనీ కూడా ఒక్కొక్కదానికి రూ.36 లక్షలు వెచ్చించి 14 ప్లాంట్లు ఏర్పాటు చేసింది

రూ.7 లక్షల చొప్పున ఖర్చు చేస్తూ మరో 33 ప్లాంట్లు ఏర్పాటు చేస్తోంది

ప్రతి పంచాయతీలో మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాం

గిరిజనుల అభ్యున్నతిపైనా ప్రత్యేక దృష్టి పెట్టాం

ఇప్పటి వరకు 3 వేల మంది గిరిజనులకు ఆధార్ కార్డులు ఇప్పించాం

12 గిరిజన కాలనీలను పామాయిల్ కంపెనీలు దత్తత తీసుకున్నాయి

మిగిలిన కాలనీలను కూడా పారిశ్రామికవేత్తలకు దత్తత ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాం

టీపీ గూడూరు మండలం మల్లికార్జునపురంలోని 280 కుటుంబాలను SEIL కంపెనీ దత్తత తీసుకుంది

ఆ గ్రామంలో ఈ ఏడాది రూ.3 కోట్లు ఖర్చుపెట్టడంతో పాటు వచ్చే ఏడాది నుంచి ఏటా రూ.1.30 కోట్లు ఖర్చుపెడతామని SEIL ప్రకటించింది

జెమినీ కంపెనీ బ్రహ్మదేవం గిరిజన కాలనీలో రూ.93 లక్షలతో పనులు ప్రారంభించింది

ప్రతి గిరిజన కాలనీలోనూ ఆయా కంపెనీలు యాక్షన్ ప్లాన్ చేపట్టాయి

వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏనాడు పేదల కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదు

సమాజంలో అత్యంత అమాయకులైన గిరిజనుల అభ్యున్నతిని పూర్తిగా విస్మరించారు

వేలాది మందికి కనీసం ఆధార్ కార్డు ఇప్పించలేకపోయారు..సచివాలయాలు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి

గిరిజనుల కోసం నిర్మించిన ఇళ్లు కూడా అక్రమాలకు నిలయంగా మారాయి..అత్యంత నాసిరకంగా కట్టారు

సర్వేపల్లిలో గిరిజనులకు చెందిన 6 ఎకరాలను కంపెనీలకు అమ్మేసుకున్నారు

వావిలేటిపాడులో దళితుల భూములను చెరపెట్టారు

ప్రజల కష్టాలను తొలగించకపోగా కొత్తకొత్త సమస్యలు సృష్టించి దోపీడీకి పాల్పడ్డారు

కూటమి ప్రభుత్వం పాలనలో పేదలకు ఎంత వరకు సాయం చేయగలమో అంతవరకు శాయశక్తులా చేస్తాం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.