ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @
వీధికుక్కలేమో మనుషులను కరిచి చంపేస్తున్నాయి! దీంతో కుక్కలను పూర్తిగా జనం మధ్య నుంచి తొలగిద్దామంటే అదీ కుదరదు. అవీ మనలాంటి ప్రాణులే కాబట్టి వాటికీ స్వేచ్ఛ.. బతికే హక్కు ఉంటుంది. మరి మనకు ఎవరు ముఖ్యం మనుషులా.. లేక కుక్కలా!! ముందు ఈ డేటా ఓ సారి చూడండి.
రోజుకు 10 వేల మందిని కరిచేస్తున్న కుక్కలు
కుక్క కాటుతో దేశంలో గంటకు ఇద్దరు పిల్లల మరణం
2024లో దేశంలో 37.17 లక్షల కుక్క కాట్లు నమోదయ్యాయి.
అంటే, రోజుకు సగటున 10,000కుపైగా కాట్లు జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం భారత్లో ప్రతీ ఏటా రేబీస్ కారణంతో ఏకంగా 18 వేల నుంచి 20 వేల మంది మరణిస్తున్నారు. బాధితుల్లో పిల్లలే అధికం.


