మనికిరెడ్డి సేవలు ఆదర్శనీయమని, ఉభయ గోదావరి జిల్లాలలో మానికిరెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్ ద్వారా డాక్టర్ మానికిరెడ్డి సత్యనారాయణ చేస్తున్న సేవలు అభినందనీయమని కొవ్వూరు స్పెషల్ జ్యూడిషియల్ జడ్జి చింతా పద్మారావు అన్నారు. మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డస్ సామాజిక సేవలో తక్కువ సమయంలో వివిధ ప్రాంతాల్లో ఎక్కువ సేవలు చేసినందుకు గాను డాక్టర్ మానికిరెడ్డి సత్యనారాయణ కు శనివారం సాయంత్రం కొవ్వూరులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రికార్డ్ ధ్రువీకరణ పత్రాన్ని, జ్ఞాపికను, మెడల్ ను జడ్జి పద్మారావు చేతులమీద అందించారు. మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డస్ ప్రతినిధి డాక్టర్ అద్దంకి రాజా మాట్లాడుతూ మానికిరెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు, కాలేజీలలో విద్యార్థులకు చీ•• ద్వారా సామాజిక సేవతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు, లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ ద్వారా సేవా కార్యక్రమాలు. దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాల ఆడ పిల్లలకు ఉన్నత విద్యకు నగదు ప్రోత్సహకాలు. ఎయిడ్స్, కుష్టు నివారణా కార్యక్రమాలు తక్కువ సమయంలో ఎక్కువ కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా గుర్తించి ఈ రికార్డును అందించామన్నారు. కార్యక్రమంలో జి. కె స్టడీ సర్కిల్ నిర్వాహకుడు సామాజికవేత్త గెల్లా కేశవ, పి.డి.ఎస్. యూ రాష్ట్ర నాయకుడు నంబూరి మహర్షి తదితరులు పాల్గొన్నారు.

‘‘మనికిరెడ్డి సేవలు ఆదర్శనీయం’’ – స్పెషల్ జ్యూడిషియల్ జడ్జి చింతా పద్మారావు.