మనసా…! నా మనసా…!
మనసా…
నా మనసా…!
ఒక్కింత…
నీలో…
ఒంటరి తనమా…
మనసా…! నా మనసా…!
ఎటుచూసి నా…
ఊరిస్తుంది!
ఊహకందదు…
కానరాదు!
భయం కాదు కదా…
మనసా…! నా మనసా…!
తనలో… ఏదో
తపన… అది
సైయంటుoది
సైగచేస్తుంది…
మనసా…! నా మనసా…!
చిటుకేస్తుంది
చిటుకుల చిన్నది
చీరకట్టు తెలియదు
చింగారించుకుంది
చిరునవ్వలచిన్నది…
మనసా…! నా మనసా…!
వెనుక… ముందు
ఆలోచించదు…
అలంకరణే…తెలియనిది
అట,పాటల గారాలది
నడక మాత్రం…నేర్చింది…
మనసా…! నా మనసా…!
మనసు…కోరింది…
మది…మురిసింది
ఎందరినో పరికింది
ఎద నిన్నే ఉరికింది
ముసి… ముసి నవ్వలది…
మనసా…! నా మనసా…!
నిలో వున్నది
నే నైతే…
నాకోసమే
నీవైతే…
మొగ మిస్తే…
మురుపించే
ముద్దిస్తా…
మనసా…! నా మనసా…!
*****
బందిల మోహన్, Msc.,MEd.
బిరుదు : కవి మిత్ర
నాయుడుపేట, తిరుపతి
మొ: 949046361.

