01-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం మండలం చెల్లాయపాలెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ” మనం – మన పరిశుభ్రత ” కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో భాగంగానే ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే గ్రామాలలో నివసించే ప్రజలు కూడా ఆరోగ్యముగా ఉంటారని అన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రతి కుటుంబం నుంచి రోజుకు రెండు రూపాయల చొప్పున వసూలు చేస్తూ అలా వచ్చిన డబ్బును గ్రామంలో పరిసరాలను పరిశుభ్రం పరిచే ఈ కార్యక్రమానికి ఉపయోగిస్తారని అన్నారు. ఇందులో భాగంగానే చెల్లాయపాలెం గ్రామములో సేకరించిన చెత్తను డంప్ చేయడానికి డంపింగ్ యార్డ్ కూడా ప్రారంభించారు. అంతే కాకుండా ఆయన మొక్కలను నాటుతూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే, ప్రతిఒక్కరు చెట్లను నాటాలని అన్నారు. ఈ సందర్భంగా మనం మన పరిశుభ్రత కార్యక్రమం గురించి మాట్లాడుతూ మన జిల్లాలోని ప్రతి మండలంలో రెండు గ్రామాలను ఎంపిక చేసుకొని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో పరిశుభ్రత పైన చైతన్యం తీసుకురావాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనా కట్టడి నేపథ్యంలో లాక్ డౌన్ విధించదముతో ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు మాత్రమే కాకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా, దాతలు ద్వారా, వైసిపి నాయకులు కార్యకర్తలు ద్వారా కూడా 13 జిల్లాల్లో అన్ని ప్రాంతాలలో ముందుకు వచ్చి ఉడతాభక్తిగా నిత్యవసర వస్తువులు రైస్, కూరగాయలు, పాలు, వంటివి పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగానే మన కలెక్టర్ శేషగిరిరావు అరవింద్ ఫార్మసీ వాళ్ళతో మాట్లాడి మన జిల్లాకు కూడా ఏదో ఒక సహాయం చేయండని కోరిన మీదట నెల్లూరు జిల్లాకి నిత్యావసర సరుకుల కిట్లను పంపించడం జరిగింది. మన నియోజకవర్గానికి మూడు వందల కిట్లును ఇచ్చారు. ఇవి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో చల్లా గిరిజనులను ఎంపిక చేసుకొని వారికి అందించాలని అనుకున్నామన్నారు. అందులో భాగంగానే ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెం మండలం చెల్లాయపాలెం గ్రామంలో 65 కిట్లను పంపిణీ చేస్తున్నాము అని అన్నారు. కలెక్టర్ గారు అరవింద్ ఫార్మసీ వాళ్ళతో మాట్లాడి మన జిల్లాకు కిట్లను ఇచ్చినందుకు కలెక్టర్ గారికి మరియు జిల్లా పరిషత్తు సి ఈ ఓ గారికి కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంలో దాదాపు మూడు కోట్ల 58 లక్షల మంది లబ్ధిదారులకు 40 వేల కోట్లకు పైగా లబ్ది చేకూరే విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏర్పడకముందు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. అయినా ఇచ్చిన హామీల ప్రకారం అన్నిటినీ నెరవేర్చుకుంటూ ప్రజల హృదయాలను గెలుచుకోవడంలో విజయం సాధించారు. ఈ విజయాన్ని చూసి చంద్రబాబు నాయుడు సహించలేకపోతున్నాడని ఆయన అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు ప్రతి ఒక్కరు పని చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరం రోజుల్లో ఎక్కడ అవినీతికి తావు లేకుండా పరిపాలన సాగించిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంతవరకు మా జగన్ మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా చంద్రబాబు పీకలేడు అని ఆయన ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే వవ్వేరు బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసులు రెడ్డి కానుగ చెట్ల కాలనీ సెంటర్లో సుమారు 50 కుటుంబాలకు నిత్యవసర సరుకులను ప్రసన్న కుమార్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వవ్వేరు బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డి, సి ఐ సురేష్ బాబు, ఎమ్మార్వో షఫీ మాలిక్, ఎంపీడీవో నరసింహారావు, ఎస్సై జిలాని, మైనార్టీ నాయకులు అల్లాబక్షు, అన్ని శాఖలకు సంబంధించిన మండల స్థాయి అధికారులు, వైసీపీ కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.