మధు కుటుంబానికి పవన్ 50 లక్షలు విరాళం.
కావలి, ఏప్రిల్ ( పున్నమి ప్రతినిధి)
జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ
పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పెహల్గాం అమరులకి మంగళగిరి లో నివాళి కార్యక్రమంలో మధుసూదనరావు కుటుంబానికి 50 లక్షల విరాళం ఇవ్వడం పై కావలి జనసేన ఇన్చార్జి అళహరి సుధాకర్ హర్షం వ్యక్తం చేశారు.. కావలి వాసి జనసైనికుడు సోమిశెట్టి మధుసూదన్ రావు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి జనసేన పార్టీ రాష్ట్రనాయకులు, వీరమహిళలతో కలిసి కావలి నియోజకవర్గ ఇంచార్జ్ అళహరి సుధాకర్ పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ దాడిలో పాల్గొన్న అమరులకు నివాళులు అర్పిస్తు భావోద్వేగానికి గురి అయ్యారు. ముఖ్యంగా కావలిలో మధుసూదన్ శ్రీమతి పిల్లలు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎంతో బాధను వ్యక్తపరిచారు. ఏదీ సందర్భంగా వారు వారి కుటుంబానికి జనసేన పార్టీ తరుపున 50 లక్షలు ప్రకటించారు. దీనితో పాటు క్రియాశీల కార్యకర్తగా మరో 5 లక్షలు కూడా వారి కుటుంబానికి అందించడము తో పాటు ఎప్పటికీ వారి కుటుంబానికి అండగా ఉంటానని తెలియజేశారు. దీని ద్వారా మరోసారి పవన్ కళ్యాణ్ జనసైనికునికి ఇచ్చే భరోసా ఇంకోసారి రుజువైంది అని, ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ నాయకులు వీరమహిళల తరుపున పవన్ కళ్యాణ్ కి అళహరి సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు.