ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి)
మధిర మున్సిపాలిటీలో నూతన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. మున్సిపల్ సభ్యుల మద్దతుతో చైర్మన్గా శ్రీమతి సామినేని సుజాత ఎన్నిక కాగా, వైస్ చైర్మన్గా కోన ధని కుమార్ ఎంపికయ్యారు.
ఎన్నికల అనంతరం స్థానిక శాసన సభ్యులుతెలంగాణ ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క నూతనంగా ఎన్నికైన చైర్మన్ సామినేని సుజాత, వైస్ చైర్మన్ కోన ధని కుమార్లకు అభినందనలు తెలియజేశారు. మధిర పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల మెరుగుదల కోసం సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నూతన మున్సిపల్ నాయకత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజా సేవలో ముందుండాలని ఆకాంక్షించారు.



