సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @
భారత్లోని ధనికుల్లో మూడింట ఒకవంతు మంది మద్యానికి దూరంగా ఉన్నారని మెర్సెడెస్ బెంజ్ హురున్ ఇండియా లగ్జరీ కన్జ్యూమర్ సర్వే 2025లో తేలింది.
నికర సంపద రూ.8.5 కోట్లు ఉన్న 150 మంది సర్వేలో పాల్గొన్నారు.
ఇందులో 34% మంది మద్యం అస్సలే సేవించమని చెప్పారు.
మరో 32% మంది మద్యం తాగుతున్నామని అందులోనూ ‘విస్కీ’కి ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.
11% రెడ్ వైన్, 9% మంది షాంపైన్ తాగేందుకు ఇష్టపడుతున్నారు.


