Thursday, 19 March 2026
  • Home  
  • మద్యం మత్తులో ఘర్షణ.. చివరకు ప్రాణం తీసిన దాడి
- అన్నమయ్య

మద్యం మత్తులో ఘర్షణ.. చివరకు ప్రాణం తీసిన దాడి

– పెనగలూరు మండలంలో నరసింహులు హత్య కేసు ఛేదించిన పోలీసులు – ఇద్దరు నిందితుల అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు – జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాలతో కట్టుదిట్టమైన చర్యలు మద్యం మత్తులో జరిగిన చిన్నపాటి గొడవ కాస్తా ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న విషాద ఘటన పెనగలూరు మండలంలో చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరిని కోడూరు రూరల్ పోలీసులు బుధవారం రాత్రి చాకచక్యంగా అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) శ్రీ ఎల్. సుబ్బారాయుడు గారి కట్టుదిట్టమైన ఆదేశాల మేరకు, రేణిగుంట ఎస్డీపిఓ శ్రీ వై. శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో పోలీసులు ఈ కేసును ఛేదించారు. -అసలేం జరిగిందంటే? పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 11వ తేదీ రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో పెనగలూరు మండలం ఇండ్లూరు గ్రామంలోని శివకృష్ణ వైన్ షాప్ వద్ద మద్యం మత్తులో ఘర్షణ చోటుచేసుకుంది. పెనగలూరు మండలం కంభాలకుంట గ్రామానికి చెందిన గుండ్లూరు వెంకటేశు, గుండ్లూరు గణేష్ అలియాస్ గని అనే ఇద్దరు వ్యక్తులు.. పాత సింగనమల గ్రామానికి చెందిన సామినేని నరసింహులు (38) పై విచక్షణారహితంగా దాడి చేశారు. మద్యం మత్తులో ఉన్న నిందితులు నరసింహులును చేతులతో, కాళ్లతో బాదారు. -చికిత్స పొందుతూ మృతి: ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నరసింహులును బంధువులు ఆసుపత్రికి తరలించారు. తొలుత పెనగలూరు పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 17/2026 కింద కేసు నమోదైంది. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ నెల 17వ తేదీన నరసింహులు మృతి చెందారు. దీంతో పోలీసులు ఈ కేసును హత్య కేసుగా (Section 105 BNS) మార్పు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. -బెస్తపల్లి వద్ద నిందితుల అరెస్ట్: నిందితులు పరారీలో ఉన్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు.. కోడూరు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ డి. శ్రీనివాసులు, పెనగలూరు ఎస్సై శ్రీ కె. రఘురాం మరియు పోలీస్ సిబ్బంది కలిసి బుధవారం (18-03-2026) రాత్రి 8:20 గంటల సమయంలో మెరుపు దాడి చేశారు. కోమంతరాజుపురం వెళ్లే మార్గంలో బెస్తపల్లి గ్రామం వద్ద మాటు వేసి నిందితులు వెంకటేశు మరియు గణేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. -న్యాయస్థానంలో హాజరు: అరెస్ట్ చేసిన నిందితులను గురువారం (19-03-2026) గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించనున్నట్లు సీఐ డి. శ్రీనివాసులు తెలిపారు. మద్యం మత్తులో గొడవలకు దిగి ఇతరుల ప్రాణాలు తీసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కేసును తక్కువ సమయంలో ఛేదించిన పోలీస్ బృందాన్ని జిల్లా ఉన్నతాధికారులు అభినందించారు.

– పెనగలూరు మండలంలో నరసింహులు హత్య కేసు ఛేదించిన పోలీసులు

– ఇద్దరు నిందితుల అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

– జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాలతో కట్టుదిట్టమైన చర్యలు

మద్యం మత్తులో జరిగిన చిన్నపాటి గొడవ కాస్తా ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న విషాద ఘటన పెనగలూరు మండలంలో చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరిని కోడూరు రూరల్ పోలీసులు బుధవారం రాత్రి చాకచక్యంగా అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) శ్రీ ఎల్. సుబ్బారాయుడు గారి కట్టుదిట్టమైన ఆదేశాల మేరకు, రేణిగుంట ఎస్డీపిఓ శ్రీ వై. శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో పోలీసులు ఈ కేసును ఛేదించారు.

-అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 11వ తేదీ రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో పెనగలూరు మండలం ఇండ్లూరు గ్రామంలోని శివకృష్ణ వైన్ షాప్ వద్ద మద్యం మత్తులో ఘర్షణ చోటుచేసుకుంది. పెనగలూరు మండలం కంభాలకుంట గ్రామానికి చెందిన గుండ్లూరు వెంకటేశు, గుండ్లూరు గణేష్ అలియాస్ గని అనే ఇద్దరు వ్యక్తులు.. పాత సింగనమల గ్రామానికి చెందిన సామినేని నరసింహులు (38) పై విచక్షణారహితంగా దాడి చేశారు. మద్యం మత్తులో ఉన్న నిందితులు నరసింహులును చేతులతో, కాళ్లతో బాదారు.

-చికిత్స పొందుతూ మృతి:

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నరసింహులును బంధువులు ఆసుపత్రికి తరలించారు. తొలుత పెనగలూరు పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 17/2026 కింద కేసు నమోదైంది. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ నెల 17వ తేదీన నరసింహులు మృతి చెందారు. దీంతో పోలీసులు ఈ కేసును హత్య కేసుగా (Section 105 BNS) మార్పు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

-బెస్తపల్లి వద్ద నిందితుల అరెస్ట్:

నిందితులు పరారీలో ఉన్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు.. కోడూరు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ డి. శ్రీనివాసులు, పెనగలూరు ఎస్సై శ్రీ కె. రఘురాం మరియు పోలీస్ సిబ్బంది కలిసి బుధవారం (18-03-2026) రాత్రి 8:20 గంటల సమయంలో మెరుపు దాడి చేశారు. కోమంతరాజుపురం వెళ్లే మార్గంలో బెస్తపల్లి గ్రామం వద్ద మాటు వేసి నిందితులు వెంకటేశు మరియు గణేష్‌లను అదుపులోకి తీసుకున్నారు.

-న్యాయస్థానంలో హాజరు:

అరెస్ట్ చేసిన నిందితులను గురువారం (19-03-2026) గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించనున్నట్లు సీఐ డి. శ్రీనివాసులు తెలిపారు. మద్యం మత్తులో గొడవలకు దిగి ఇతరుల ప్రాణాలు తీసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కేసును తక్కువ సమయంలో ఛేదించిన పోలీస్ బృందాన్ని జిల్లా ఉన్నతాధికారులు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.