పున్నమి ప్రతి నిధి
తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల లైసెన్స్‌ల దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 23 వరకు పొడిగించింది. బ్యాంకులు సెలవుల కారణంగా పనిచేయకపోవడంతో డీడీలు సమర్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాపారులు తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గడువు పొడిగింపుతో లక్కీ డ్రా తేదీ కూడా వాయిదా పడింది. ఇకపై లక్కీ డ్రా అక్టోబర్ 27న నిర్వహించనున్నారు. మొత్తం 2,620 మద్యం దుకాణాలకు ఇప్పటివరకు దాదాపు 90 వేల దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


