మేడ్చల్–మల్కాజ్గిరి, నవంబర్ 13 :
శ్రీనిధి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల (SNIST)లో నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) యూనిట్ మరియు Eagle Force సంయుక్త ఆధ్వర్యంలో మత్తు ద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. యువతలో మత్తు ద్రవ్యాల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ Dr. టి. చి. శివారెడ్డి గారు, NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ Dr. ప్రీతి జీవన్ గారు మరియు Eagle Force బృందం సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. ప్రధాన అతిథులుగా శ్రీ సైదులు గారు (డీఎస్పీ), శ్రీ పి. శ్రీనివాస్ గారు (ఇన్స్పెక్టర్), శ్రీమతి కె. మాధవి గారు (నేషనల్ ప్రెసిడెంట్ – ఇంపాక్ట్ ఇంటర్నేషనల్), శ్రీ రామచంద్రుడు గారు (నేషనల్ సెక్రటరీ – ఇంపాక్ట్ ఇంటర్నేషనల్), శ్రీ పర్షురామ్ బింగి గారు (ఆంటీ డ్రగ్స్ సోల్జర్), శ్రీ ఎల్. రమేష్ గారు, మరియు శ్రీ తులసీకుమార్ గారు పాల్గొన్నారు.
ముఖ్య అతిథులు విద్యార్థులకు మత్తు ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, కుటుంబం మరియు సమాజంపై వాటి దుష్ప్రభావం గురించి వివరించారు. “మత్తు ద్రవ్యాలు మన భవిష్యత్తును చీకటిలోకి నెడతాయి – వాటికి దూరంగా ఉండటం మన బాధ్యత” అని యువతకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా Eagle Force ప్రతినిధులు తమ సంస్థ దేశవ్యాప్తంగా చేపడుతున్న Anti-Drug Awareness కార్యక్రమాల గురించి వివరించారు. వారు మత్తు ద్రవ్యాల వ్యసనాన్ని పూర్తిగా నిర్మూలించడం లక్ష్యంగా తీసుకుని, ప్రతి జిల్లాలో యువతలో చైతన్యం కల్పించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమాజంలో మత్తు ద్రవ్యాల వ్యతిరేక పోరాటం కొనసాగిస్తూ, ప్రభుత్వ సంస్థలతో పాటు విద్యాసంస్థల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా Eagle Force బృందం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, బాధ్యతా భావం పెంచడంలో కీలకపాత్ర పోషించింది.
కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో NSS యూనిట్ ముఖ్యపాత్ర పోషించింది. సామాజిక సేవా దృక్పథంతో ప్రతి కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహిస్తూ, సమాజ అభివృద్ధికి NSS వాలంటీర్లు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా కూడా NSS తమ సేవాతత్వాన్ని మరొకసారి ప్రతిఫలింపజేసింది.


