
విశాఖపట్నం, మహారాణిపేట:
మహారాణిపేట పోలీసులు మానవత్వాన్ని చాటారు. మతి స్థిమితం లేని వ్యక్తిని కేవలం ఒక గంటలోనే వెతికి వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు.
పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ దివాకర్ యాదవ్ వివరాల ప్రకారం, నర్సీపట్నం ప్రాంతానికి చెందిన లెక్కల శ్రీనుబాబు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం మతి స్థిమితం లేకపోవడంతో కుటుంబ సభ్యులకు తెలియజేయకుండానే ఆసుపత్రి నుండి బయటకు వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో మహారాణిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు శ్రమించి కేవలం గంట వ్యవధిలోనే శ్రీనుబాబు ఆచూకీ కనుగొని, సురక్షితంగా వారి కుటుంబానికి చేర్చారు.

