పున్నమి Daily న్యూస్
T.Ravinder
ప్రతినిథి
ఖమ్మం
మణుగూరు పోలీస్ స్టేషన్ లో ఏసీబీ దాడులు…
మణుగూరు పోలీస్ స్టేషన్ లో కరీంనగర్ ఏసీబీ డిఎస్పీ విజయ్ కుమార్ అద్వర్యం లో దాడులు నిర్వహించి ఎస్ ఐ బత్తిని రంజిత్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారించారు.
: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. మణుగూరు పోలీస్ స్టేషన్ లో ఎస్సై బత్తిని రంజిత్ కుమార్, నాలుగు కార్ల పంచాయతీ కేసులో ముద్దాయిలకు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి వారి వద్ద నుండి 40,000 డిమాండ్ చేయడంతో, బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు..
ఈ రోజు మణుగూరు పోలీసుస్టేషన్ లో ఏసీబీ అధికారులు బాధితుల సమాచారం మేరకు ఎస్సై రంజిత్ కుమార్ ను విచారించారు. ఎస్సై నిందితులతో మాట్లాడిన ఆడియో, వీడియో రికార్డుల ఆధారంగా మణుగూరు పోలీస్ స్టేషన్లో ఎస్సై బత్తిని రంజిత్ కుమార్ ను అదుపులోకి తీసుకొని అతని పై క్రైమ్ నెంబర్ 292 /25 , 7B సెక్షన్ నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని ఏసిబి డిఎస్పి విజయ్ కుమార్ తెలిపారు.
బైట్ : విజయ్ కుమార్ ( ఏసీబీ డీఎస్పీ కరీంనగర్ )

