మంత్రి నారా లోకేష్ఆ త్మీయ విందులో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్
ఉండవల్లిలోని గౌరవ ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ఆత్మీయ విందు కార్యక్రమంలో జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. స్నేహపూర్వక వాతావరణంలో సాగిన ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ గారు అందరితో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. నాయకత్వానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఆత్మీయ సమ్మేళనం పరస్పర అవగాహనను మరింత బలోపేతం చేసింది. ప్రజా సేవలో సమన్వయం, సత్సంబంధాలు ఎంత ముఖ్యమో ఈ విందు మరోసారి చాటి చెప్పింది.



