Wednesday, 25 March 2026
  • Home  
  • మంత్రి కొండా సురేఖ 4 పర్యయాలు వచ్చి కనీసం 4రూపాయలు కూడా ఇవ్వలేదు.
- జోగులాంబ గద్వాల

మంత్రి కొండా సురేఖ 4 పర్యయాలు వచ్చి కనీసం 4రూపాయలు కూడా ఇవ్వలేదు.

అలంపూర్ : అక్టోబర్ 29 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం బిజెపి జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ, అలంపూర్ ఆలయానికి 4 పర్యయాలు వచ్చి కనీసం 4రూపాయలు కూడా ఇవ్వలేదు, అలంపూర్ లో నిత్యఅన్నదానం ఒకపూటకే పరిమితమైంది, కనీసం భక్తులకు టాయిలెట్స్, సరైన బస్సుసదుపాయం, రోడ్లు, ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు. కాని మీరు ఇన్ని సార్లు వచ్చి ఏమైనా పట్టించుకున్నారా అని ఏద్దేవ చేశారు. కేద్రం ప్రభుత్వం ప్రసాద్ స్కీం నుండి 70 కోట్లు కేటాయిస్తే గత ప్రభుత్వం సరైన వసతులు చూపించక 22 కోట్లకు పరిమితం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమ్మక్క సారక్క ఆలయాలకు ఎంతైనా ఇస్తాను అన్నారు. సంతోషం, కాని జోగులాంబ ఆలయానికి మాత్రం ఒక్కరూపాయి నిధులు ఇవ్వకపోవడం శోచనీయం అన్నారు. కావున రాబోయే స్థానిక ఎన్నికల్లో తప్పకుండా అధికార పార్టీకి ప్రజలు బుద్దిచెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి, గోపాలకృష్ణ, ఉప అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, ఖుషి తదితరులు పాల్గొన్నారు.

అలంపూర్ : అక్టోబర్ 29 ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం బిజెపి జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ, అలంపూర్ ఆలయానికి 4 పర్యయాలు వచ్చి కనీసం 4రూపాయలు కూడా ఇవ్వలేదు, అలంపూర్ లో నిత్యఅన్నదానం ఒకపూటకే పరిమితమైంది, కనీసం భక్తులకు టాయిలెట్స్, సరైన బస్సుసదుపాయం, రోడ్లు, ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు. కాని మీరు ఇన్ని సార్లు వచ్చి ఏమైనా పట్టించుకున్నారా అని ఏద్దేవ చేశారు.
కేద్రం ప్రభుత్వం ప్రసాద్ స్కీం నుండి 70 కోట్లు కేటాయిస్తే గత ప్రభుత్వం సరైన వసతులు చూపించక 22 కోట్లకు పరిమితం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమ్మక్క సారక్క ఆలయాలకు ఎంతైనా ఇస్తాను అన్నారు. సంతోషం, కాని జోగులాంబ ఆలయానికి మాత్రం ఒక్కరూపాయి నిధులు ఇవ్వకపోవడం శోచనీయం అన్నారు. కావున రాబోయే స్థానిక ఎన్నికల్లో తప్పకుండా అధికార పార్టీకి ప్రజలు బుద్దిచెబుతారన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి, గోపాలకృష్ణ, ఉప అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, ఖుషి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.