పున్నమి ప్రతినిధి:
తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం విజయవాడలో రాష్ట్ర మంత్రి శ్రీ కందుల దుర్గేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
కలెక్టర్ మరియు మంత్రి మధ్య జరిగిన సమావేశంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై, వాటికి అవసరమైన అనుమతులపై చర్చ జరిగింది. ముఖ్యంగా సాగు, పారిశుద్ధ్యం మరియు నీటి రంగ అభివృద్ధికి సంబంధించి వివిధ అంశాలపై సమీక్ష జరిగింది.
జిల్లాలో మౌలిక వసతుల నిర్మాణానికి అవసరమైన శాశ్వత అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని Collector మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన మంత్రి శ్రీ కందుల దుర్గేశ్, ప్రభుత్వ సహకారం అన్ని విధాలుగా అందిస్తామని, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే కార్యక్రమాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.


