అక్షర తుణిరం.. అందెశ్రీ
అక్షరాలకు మాటలు నేర్పిన అందే శ్రీ
ఆకాశానికి తుణిరమై ఏగినావా..
మనుషుల్లో మంచితనం కొరబడిందని ఆవేదనతో
మనుషులు మారాలని మంచి మనసుతో ఉండాలని.. ఆశించిన నీ మనసుకు. నీకు జోహార్లు
మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు అంటూనే.. మా నుండి మాయమయ్య వా.. వెన్నపూస మనసున్న ఓ అందెశ్రీ అన్న
నిస్వార్ధానికి నిరాడంబరతకు నిలువెత్తు దర్పణం నీవన్న
సామాజిక కవులకు నీవే ఆదర్శం
తెలంగాణ తల్లి శిఖరాన నువోక కిరీటం.. నీ మనసున ఉవ్వెతున లేచిన అక్షర కెరటాలు.. తెలంగాణ జాతీయ గీతం రెపరెపలు
చదువు లేకున్నా నువ్వు ఒక అక్షర జ్ఞానివి.. నీ కంటాన మెరిసేను కాకతీయ డాక్టరేటు.
దొడ్డ మనసున్న.. దొరతనం కానరాని
అందరి వాడవు నీవే అన్న అందుకే
గంగతో ఆదరించెను నంది అవార్డు
తెలంగాణ నా కోటి రతనాల వీణ అన్న దాశరధి పురస్కార గ్రహీతవు .
తెలంగాణ ప్రభుత్వ అధినేత
రేవంత్ అన్న నీకు అందించెను కోటి రూపాయలు రొక్కమును..
శృంగేరి పీఠ స్వామి శంకర్ మహారాజు దీవెనలతో..
వాణి, గిర్వాణిని భాసర సరస్వతమ్మ ను వాక్కులమ్మగా ఆరాధించిన విజ్ఞానులు మీరు..
సిద్ధప్ప వారకవి స్ఫూర్తితో రచనలు చేసినంటివి..
గుండారెడ్డిపల్లికి వెళ్లి.
వారకవి రచనల అవపోసానా పడితివి
తెలంగాణ బతుకు చిత్రం బతుకమ్మకు వినుసంపైన మాటలను రాస్తివి
నీ అక్షరార్చనతో.. పల్లె నీకు వందనాలమ్మ అంటూ వందనాలు చేస్తివి..
కొమ్మ చెక్కితే బొమ్మ రా అంటూ అమ్మ విలువను.. అవనికి చాటితివి..
అవారగాడువై.. ఆ చిత్రానికి… మొన్న తెచ్చాను నీ పాటలు వస్తావా జానకి వంగతోటకు అంటూ మాయ చేసావా మనిషి కదా అని…..
ఇలా ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించితివి.. తెలంగాణ కవి గుండెల్లో మరుపురాని చిత్రానివై.. ఆ సూర్యుడికి సింధూరమైనవా.. అందరి శ్రీ ఎల్లన్న..
నీకు నా కవిత పుష్పాంజలి ఘటిస్తూ.. అక్షర నివాళి
నీ వారసులైన ముగ్గురమ్మలకు వారసునికి నా ప్రగాఢ సానుభూతి..
రచన: ఇమ్మడి రాంబాబు తొర్రూరు
జిల్లా మహబూబాబాద్
9866660531


