ఓబులవారిపల్లి మండలం మంగంపేట మైన్స్ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా ముగ్గురాళ్ల మిల్లుల కు అవసరమైన రాయి సరఫరా ఏపీఎండిసి యాజమాన్యం మరియు మిల్లుల యాజమాన్యం మధ్య ఉన్న కొన్ని సమస్యల కారణంగా నిలిచిపోవడంతో 120కి పైగా మిల్లులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ సమస్యల వల్ల స్థానిక పరిశ్రమలు, కార్మికులు, రోజువారీ ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడింది,
ఈ పరిస్థితిని మంగంపేట ప్రాంత మిల్లు యజమానులు రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి దృష్టికి తేవడం జరిగింది. ఈ నేపథ్యంలో ముక్కా రూపానంద రెడ్డి స్పందించి విజయవాడలోని ఏపీఎండిసి హెడ్ ఆఫీస్ నందు ఎండీ తో ప్రత్యక్షంగా మాట్లాదంతో, మంగంపేట మైన్స్‌లో సరఫరా నిలిచిపోవడానికి కారణాలను తెలుసుకుని, సమస్యల పై ఆయన సానుకూలంగా స్పందించారు.
అందువలన ఫలితంగా, మంగంపేట మైన్స్ నుంచి మిల్స్‌కు రాయి సరఫరా పునరుద్ధరించేందుకు ఏపీఎండిసి అంగీకరించింది. దీంతో గత కొన్ని రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 120 మిల్లుల సమస్యకు పరిష్కారం లభించింది. పరిశ్రమల కార్యకలాపాలు తిరిగి పునరుద్ధరించుకునే అవకాశమొచ్చింది. అందువలన తిరిగి మిల్లులకు ముగ్గురాయి సరఫరా యధావిధిగా పునరుద్ధరించడం జరిగింది.
స్థానిక పారిశ్రామికవేత్తలు,ఈ సమస్యను పరిష్కరించినందుకు ముక్కా రూపానంద రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రాంత అభివృద్ధి, పరిశ్రమల ప్రోత్సాహం కోసం ఆయన చూపుతున్న కృషి ప్రశంసనీయమని హర్షం వ్యక్తం చేశారు , అనంతరం ఏపిఎండిసి హెడ్ ఆఫీసీ నందు జరిగిన చర్చలలో స్థానిక పల్లవ రైజింగ్ మిల్లుల యజమానులు పాల్కొన్నారు.

మంగంపేట మిల్లుల సమస్యలను పరిష్కరించిన ముక్కా రూపానంద రెడ్డి
ఓబులవారిపల్లి మండలం మంగంపేట మైన్స్ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా ముగ్గురాళ్ల మిల్లుల కు అవసరమైన రాయి సరఫరా ఏపీఎండిసి యాజమాన్యం మరియు మిల్లుల యాజమాన్యం మధ్య ఉన్న కొన్ని సమస్యల కారణంగా నిలిచిపోవడంతో 120కి పైగా మిల్లులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ సమస్యల వల్ల స్థానిక పరిశ్రమలు, కార్మికులు, రోజువారీ ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడింది, ఈ పరిస్థితిని మంగంపేట ప్రాంత మిల్లు యజమానులు రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి దృష్టికి తేవడం జరిగింది. ఈ నేపథ్యంలో ముక్కా రూపానంద రెడ్డి స్పందించి విజయవాడలోని ఏపీఎండిసి హెడ్ ఆఫీస్ నందు ఎండీ తో ప్రత్యక్షంగా మాట్లాదంతో, మంగంపేట మైన్స్‌లో సరఫరా నిలిచిపోవడానికి కారణాలను తెలుసుకుని, సమస్యల పై ఆయన సానుకూలంగా స్పందించారు. అందువలన ఫలితంగా, మంగంపేట మైన్స్ నుంచి మిల్స్‌కు రాయి సరఫరా పునరుద్ధరించేందుకు ఏపీఎండిసి అంగీకరించింది. దీంతో గత కొన్ని రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 120 మిల్లుల సమస్యకు పరిష్కారం లభించింది. పరిశ్రమల కార్యకలాపాలు తిరిగి పునరుద్ధరించుకునే అవకాశమొచ్చింది. అందువలన తిరిగి మిల్లులకు ముగ్గురాయి సరఫరా యధావిధిగా పునరుద్ధరించడం జరిగింది. స్థానిక పారిశ్రామికవేత్తలు,ఈ సమస్యను పరిష్కరించినందుకు ముక్కా రూపానంద రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రాంత అభివృద్ధి, పరిశ్రమల ప్రోత్సాహం కోసం ఆయన చూపుతున్న కృషి ప్రశంసనీయమని హర్షం వ్యక్తం చేశారు , అనంతరం ఏపిఎండిసి హెడ్ ఆఫీసీ నందు జరిగిన చర్చలలో స్థానిక పల్లవ రైజింగ్ మిల్లుల యజమానులు పాల్కొన్నారు.

